తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కాంగ్రెస్ నేతలు కలిశారు. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్న లేఖను గవర్నర్ కు అందించారు.
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ ను కాంగ్రెస్ నేతలు బుధవారంనాడు కలిశారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశం రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టుగా లేఖను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు కాంగ్రెస్ నేతలు అందించారు. రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్టుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు అందించారు.
ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన విషయాన్ని గవర్నర్ కు కాంగ్రెస్ నేతలు వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్ ను కోరిన విషయం తెలిసిందే.
undefined
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేందుకు ముందుగా శాసనసభపక్ష నేతగా ఎవరిని ఎన్నుకున్నారనే విషయమై లేఖ అందించాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ శాసనసభపక్ష నేతగా ఎన్నుకున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఈ లేఖ ద్వారా గవర్నర్ కు తెలిపారు. రేపు మధ్యాహ్నం 01:04 గంటలకు ఎల్ బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు.
రేపు ఉదయం 10:28 గంటలకు రేవంత్ రెడ్డి ప్రమాణం చేయాలని భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. దీంతో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్నిరేపు మధ్యాహ్నం 01:04 గంటలకు ప్రమాణం చేయనున్నారు.