కాంగ్రెస్‌లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..

By Sumanth Kanukula  |  First Published Oct 26, 2023, 5:01 PM IST

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.


మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ రోజు గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి చేరిక అంశాన్ని మీడియా ప్రతినిధులు రేవంత్ వద్ద ప్రస్తావించారు. ఇందుకు రేవంత్ స్పందిస్తూ.. కాంగ్రెస్‌లో చేరతారని వారే(రాజగోపాల్ రెడ్డి) చెప్పారని.. ఎప్పుడు చేరేది కూడా వారే చెబుతారని అన్నారు. వారికి ఆ పూర్తి స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని..వారు ఎప్పుడు చేరాలనుకుంటే అప్పుడు చేరొచ్చని అన్నారు. 

బీఆర్ఎస్, బీజేపీలు కొట్లాడుకుంటున్నాయని.. కేసీఆర్ అవినీతి లక్ష కోట్ల సంపాదన మీద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ఉద్దేశ్యంతో రాజగోపాల్ రెడ్డి, వివేక్, కొండా విశ్వేశ్వర రెడ్డి, విజయశాంతి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి వంటి నేతలు ఆ పార్టీలో చేరారని అన్నారు. అయితే బీజేపీలో చేరిన తర్వాత బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని అర్థం చేసుకున్నారని అన్నారు. 

Latest Videos

దోచుకున్నది బీజేపీ, బీఆర్ఎస్‌లు పంచుకుంటున్నాయని తెలిసిందని.. అది చూసి అక్కడ ఇమడలేక కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం అని వారు భావిస్తున్నారని పేర్కొన్నారు. వారిది కాంగ్రెస్ సిద్దాంతమేనని.. రాష్ట్రంలో అవినీతిని అరికట్టడానికే బీజేపీతో చేరామని చెప్పారని రేవంత్ పేర్కొన్నారు. వారిది బీజేపీ సిద్దాంతం కాదని అన్నారు. కేసీఆర్ అవినీతిపై మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు భావించారని.. అయితే ఆ అవినీతిలో వారికి కూడా భాగస్వామ్యం ఉందని గుర్తించి వెనక్కు వస్తున్నారని అన్నారు. 
 

click me!