అసంతృప్తులతో మాట్లాడుతున్నాం:షబ్బీర్ అలీ

Published : Jun 27, 2021, 03:51 PM IST
అసంతృప్తులతో మాట్లాడుతున్నాం:షబ్బీర్ అలీ

సారాంశం

కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులతో మాట్లాడుతున్నామని మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ చెప్పారు.  

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులతో మాట్లాడుతున్నామని మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ చెప్పారు.టీపీసీసీ చీఫ్ గా నియామకమైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు.

also read:తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా: టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ కార్యకర్తలంతా సిపాయిలుగా పనిచేయాల్సిన సమయం ఇదేనని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని యువత బలంగా కోరుకొంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని షబ్బీర్ అలీ తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కుమ్మక్మై జలజగడం సృష్టిస్తున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డితో రేవంత్ రెడ్డి మాట్లాడుతారని షబ్బీర్ అలీ చెప్పారు.టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. టీపీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించవద్దని కాంగ్రెస్ సీనియర్లు హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Minister Sridhar Babu Comments: భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరిస్తాం | Asianet News Telugu
Hyderabad: నెల‌కు రూ. 67 ల‌క్ష‌ల అద్దె.. హైద‌రాబాద్‌లో ఫేస్‌బుక్ పెద్ద స్కెచ్