ఆత్మగౌరవం కోసం టీఆర్ఎస్‌ని వీడి... దానిని బీజేపీకి తాకట్టుపెట్టారు: ఈటలపై హరీశ్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jun 27, 2021, 3:26 PM IST
Highlights

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై విరుచుకుపడ్డారు మంత్రి హరీశ్ రావు. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని చెప్పి టీఆర్‌ఎస్‌ను వదిలి వెళ్లిన రాజేందర్‌ బీజేపీలో చేరి తన ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారంటూ ఎద్దేవా చేశారు. 

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై విరుచుకుపడ్డారు మంత్రి హరీశ్ రావు. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని చెప్పి టీఆర్‌ఎస్‌ను వదిలి వెళ్లిన రాజేందర్‌ బీజేపీలో చేరి తన ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారంటూ ఎద్దేవా చేశారు. కేవలం ఆయన తన ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీలో చేరారని హరీశ్ విమర్శించారు. కరీంనగర్‌ జిల్లా ఇల్లంతకుంట మండల బీజేపీ అధ్యక్షుడు నన్నబోయిన రవియాదవ్‌ తన అనుచరులు, మద్దతు దారులతో కలిసి మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు తీస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రజా సంక్షేమ పధకాలు అమలు జరుగుతున్నాయని హరీశ్ రావు గుర్తుచేశారు. 

Also Read:హుజూరాబాద్ ఆపరేషన్: రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్ రావు

వచ్చే ఉప ఎన్నికల్లో హుజారాబాద్‌ నుంచి  టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తే ఈటల నుంచి ఆ నియోజక వర్గానికి విముక్తి కలుగుతుందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన రవియాదవ్‌ మాట్లాడుతూ .. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృది సాధిస్తోందన్నారు. ఈటల రాజేందర్‌, ఆయన అనుచరుల వేధింపులు భరించలేకనే తాము పార్టీని వీడామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, సుడా ఛైర్మన్‌ జీవీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 
 

click me!