తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కొందరిని స్వయంగా రేవంతే ఆహ్వానించారు.
న్యూడిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ముందుండి నడిపిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పదవి దక్కింది. అధికార బిఆర్ఎస్ ను ఓడించి 64 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ నేడు అధికారాన్ని చేపట్టబోతోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులుగా కొందరు ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో సోనియా గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ పెద్దలు, జాతీయస్థాయి నాయకులు, ఇతరరాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, మాజీ కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు అతిథులుగా హాజరుకానున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొననున్నారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డే స్వయంగా అతిథులను ఆహ్వానించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి కృతజ్ఞతలు తెలిపి ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే మరికొందరు కాంగ్రెస్ నేతలను కూడా రేవంత్ రెడ్డి తన ప్రమాణానికి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడాను కూడా కలిసారు రేవంత్.
आज तेलंगाना के मनोनित मुख्यमंत्री व मेरे प्रिय भाई दिल्ली निवास आये और मां का आशीर्वाद लिया। मम्मी जी ने एक बड़ी जंग जीत कर आये योद्धा बेटे को तिलक लगाकर उनका स्वागत किया।
रेवंत उस युवा शक्ति का नाम है जिसके जज्बे और कड़ी मेहनत ने तेलंगाना में इतिहास रचा है, अब… pic.twitter.com/aIssCkEb3s
undefined
ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించేందుకు దీపేందర్ ఇంటికి వెళ్లాడు రేవంత్. ఆయనను చూడగానే ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపిన దీపేందర్ ఇంట్లోకి తీసుకెళ్లాడు. దీపేందర్ తల్లిని చూడగానే రేవంత్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె కూడా రేవంత్ కు వీరతిలకం దిద్ది మిఠాయి తినిపించారు. ఆత్మీయంగా రేవంత్ తల నిమురుతూ ముద్దాడి సొంత కొడుకులాగే రేవంత్ ను ప్రేమగా చూసుకున్నారు ఆ తల్లి.
Also Read CM Revanth Reddy: ఆరు గ్యారంటీలతోనే పాలన మొదలు.. నేడు సీఎంగా రేవంత్, మంత్రులుగా పలువురి ప్రమాణం
రేవంత్ తన ఇంటికి వచ్చిన వీడియో, ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు దీపెందర్ సింగ్. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న తన ప్రియమిత్రుడు రేవంత్ రెడ్డి తల్లి ఆశీర్వాదం తీసుకున్నాడని అన్నారు. పెద్ద యుద్దంలో విజయం సాధించి యోధుడిగా తిరిగివచ్చిన బిడ్డకు తల్లి వీరతిలకం దిద్ది స్వాగతం పలికారంటూ దీపేందర్ భావోద్వేగభరిత కామెంట్స్ చేసారు.
చాలా కష్టపడి కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చిన రేవంత్ చరిత్ర సృష్టించాడని అన్నారు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ది కోసం కష్టపడాల్సిన సమయం వచ్చింది.. ముఖ్యమంత్రిగా రేవంత్ ఇదికూడా సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తాడన్న నమ్మకం వుందన్నారు. రేవంత్ తన సుపరిపాలనతో కొత్త సువర్ణాధ్యాయం లిఖిస్తాడని కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా కొనియాడారు.