మల్కాజిగిరిలో నేను గెలుస్తా అనుకోలేదు: రేవంత్ రెడ్డి

By narsimha lodeFirst Published Nov 12, 2019, 10:22 AM IST
Highlights

మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు సివిల్ వార్ వస్తోందేమో అన్నారు. కేసీఆర్ పాలన బాగుంటే  నిజామాబాద్‌లో కవిత ఎందుకు ఓడిపోయిందని ఆయన ప్రవ్నించారు. మల్కాజిగిరిలో తాను గెలుస్తానని అనుకోలేదన్నారు. 


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని  ప్రస్తుత పరిస్థితులపై మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అమెరికాలోని న్యూజెర్సీలో ఎన్‌ఆర్ఐలు నిర్వహించిన ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఊహించిన తెలంగాణ ప్రస్తుతం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సివిల్ వార్ వస్తోందోమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

అభివృద్దికి  మావోయిస్టులు అడ్డు అనే రైటిస్టులు భావించేవారు. కానీ, నక్సలైట్లు ఉంటే ప్రభుత్వ చర్యలను నియంత్రించేవారేమోనని ప్రజలు అనుకొనే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

కేసీఆర్ పాలన బాగుంటే నిజామాబాద్ ఎంపీ స్థానంలో  సీఎం కేసీఆర్ కూతురు కవిత ఎందుకు ఓటమి పాలైందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మల్కాజిగిరి ఎంపీ స్థానంలో తాను ఎలా విజయం సాధించానన్నారు.

సందర్భం వచ్చినప్పుడు  ప్రకృతి రంగ ప్రవేశం చేస్తోందని చెప్పేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఓడిపోతానని కానీ, మల్కాజిగిరి ఎంపీ స్థానంలో విజయం సాధిస్తానని కూడ తాను ఏనాడూ ఊహించలేదని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని మేనిఫెస్టోలో చెప్పలేదని చెబుతున్న కేసీఆర్ 50 శాతం ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని చెప్పారా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం పాత్ర ఎంత అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం  ప్రాణాలను ఫణంగా పెట్టిన కుటుంబాలకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులను, రాష్ట్రంలో సాగుతున్న కేసీఆర్ పాలన గురించి  రేవంత్ రెడ్డి వివరించారు. కేసీఆర్ పాలనపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ఈ వార్తలు కూడా చదవండి

tahsildar Vijaya Reddy: నిందితుడు సురేష్ పరిస్థితి ఆందోళనకరం

tahsildar vijaya reddy: తహిసిల్దార్ విజయా రెడ్డి కారు డ్రైవర్ మృతి

vijayareddy: తహసీల్దార్ విజయారెడ్డి హత్య....బయటపడుతున్న షాకింగ్ నిజాలు

click me!