కాంగ్రెస్ రేవంత్ కు గడ్డు కాలం

First Published Nov 14, 2017, 12:47 PM IST
Highlights
  • కాంగ్రెస్ రాజకీయాలను వాచ్ చేస్తున్న రేవంత్
  • సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటున్న వైనం

తెలంగాణ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో టాప్ లీడర్ గా చెలామణి అయ్యారు. ఇంకో మాటలో చెప్పాలంటే టాప్ 1 లీడర్ రేవంతే అన్న వాతావరణం నెలకొంది. దానికి కారణం ఆయన దూకుడు, పంచ్ డైలాగులు, కొత్త కోణంలో ప్రజా సమస్యలను లేవనెత్తడం లాంటివి. అయితే కాంగ్రెస్ లో చేరిన తర్వాత రేవంత్ కు అంతటి స్థాయిలో హవా చెలాయించే వాతావరణం ఇక్కడ ఇప్పటివరకైతే కనిపించలేదు. కాంగ్రెస్ మహా సముద్రం అందులో రేవంత్ నీటి చుక్క లాంటోడు అంటూ ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు పాట మొదలు పెట్టారు. అంతేకాదు టిడిపిలో లీడర్ స్థాయిలో ఉండే రేవంత్ కాంగ్రెస్ లో కార్యకర్త స్థాయికి పడిపోయిండని టిడిపి అధ్యక్షులు రమణ కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఉంది.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా.. ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. గతంలో ఉన్న సానుకూల పరిస్థితులు ఇప్పుడు ఉండకపోవచ్చు.. కానీ గతం కంటే ఆయన మీద బాధ్యత మరింత పెరిగిన మాట కాదనలేం. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఎదుర్కొనే సవాళ్లపై ఏషియానెట్ వరుస కథనాలు ప్రచురించనున్నది. రేవంత్ కు ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్ పార్ట్ 1 స్టోరీ కింద చదవండి. (మిగతా కథనాలు వరుసగా వేస్తాం.)

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలిసారి సిఎం కేసిఆర్ కు ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ ఉద్దేశం ఏందంటే తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న అమరవీరులను గుర్తించడంలో సర్కారు విపలమైందని, నిజామాబాద్ జిల్లాలో అమరవీరుల గుర్తింపులో నిర్లక్ష్యం చూపుతున్నారన్నది. లేఖలో మాత్రం గతంలో టిడిపిలో ఉన్నప్పటి ఘాటైన పదజాలమే వాడిండు.. కానీ లేఖ ముగింపు మాత్రం విచిత్రంగా ఉంది. ఎంత విచిత్రంగా అంటే తానొక రాజకీయ నాయకుడిని అనే విషయాన్ని పొందుపరచలేని పరిస్థితి ఏర్పడింది.

గతంలో అయితే లేఖ చివరన సంతకం చేసి టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ అనో, టిడిపి శాసనసభాపక్ష నేత అనో తన రాజకీయ హోదాను మెన్సన్ చేసే పరిస్థితి ఉండేది. కానీ సోమవారం సిఎం కేసిఆర్ కు రాసిన బహిరంగ లేఖలో మాత్రం అలాంటి పదజాలం ఏదీ లేకుండా కేవలం ఎ. రేవంత్ రెడ్డి అని మాత్రమే రాసి లేఖను ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అన్నం లేకుండా అయినా ఉంటాడు కానీ.. రాజకీయ నాయకుడు ఐడెంటిటీ లేకుండా ఉండడు అన్న సామెతను మనం తరచుగా వింటూనే ఉంటాం. మరి రేవంత్ తనకు ఉన్న పదవిని చెప్పుకోలేని సంకట స్థితిలో ఆ లేఖలో అలా వదిలేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ రేవంత్ రెడ్డి టిడిపి ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఆయన ఇంకా ఆ పదవిని కోల్పోలేదు. కానీ ఆ హోదాను ఆయన వాడుకోలేని పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ లో ఇంకా ఏహోదా ఇవ్వకపోవడం కూడా గమనార్హం. ఇది రేవంత్ రెడ్డికి క్రొకడైల్ ఫెస్టివల్ లాంటిదేనని చెప్పవచ్చు.

click me!