ఎమ్మెల్యే కొడుకు అరాచకాలు సీఎం కేసీఆర్‌కు తెలియవా?.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?.. రేవంత్ రెడ్డి ఫైర్

Published : Jan 06, 2022, 01:48 PM IST
ఎమ్మెల్యే కొడుకు అరాచకాలు సీఎం కేసీఆర్‌కు తెలియవా?.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?.. రేవంత్ రెడ్డి ఫైర్

సారాంశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ‌లో నాగ రామకృష్ణ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వనమా రాఘవేంద్రను అరెస్ట్ చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వినిపిస్తుంది. తాజాగా ఈ ఘటనపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy).. వనమా రాఘ వకీచక పర్వానికి ఓ కుటుంబం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు.  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ‌లో నాగ రామకృష్ణ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్యకు ఆత్మహత్యకు ముందు Rama krihsna తీసుకున్న సెల్పీ వీడియోలో పేర్కొన్న అంశాలు సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్ర వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసకోవాలని నిర్ణయం తీసుకొన్నామని రామకృష్ణ తెలిపాడు. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవేంద్రను అరెస్ట్ చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వినిపిస్తుంది. తాజాగా వనమా రాఘవపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత రెడ్డి డిమాండ్ చేశారు. 

ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో వేదికగా స్పందించారు. వనమా రాఘ వకీచక పర్వానికి ఓ కుటుంబం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రామకృష్ణ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో వ్యక్తం చేసిన ఆవేదన చూస్తే సభ్యసమాజం సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ ఘటన జరిగి మూడు రోజులు గడిచిన కనీసం ప్రభుత్వం స్పందించలేదని Revanth Reddy ప్రశ్నించారు. కుటుంబంపై టీఆర్‌ఎస్.. పార్టీ పరమైన చర్యలు తీసుకోలేదని అన్నారు. ముఖ్యమంత్రి అండదండలు వనమా వెంకటేశ్వరరావుకు ఉన్నాయనే ఆలోచనతోటే.. రాఘవేంద్రను అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. తక్షణమే కేసీఆర్ ఈ ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక న్యాయ విచారణకు ఆదేశించాలని కోరారు. వనమా రాఘవను అరెస్టు చేయడమే కాకుండా.. ఎమ్మెల్యే గా వనమా వెంకటేశ్వరరావుతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. 

‘వనమా రాఘవకు టీఆర్ఎస్ వత్తాసుగా నిలవడం దుర్మార్గం. ఎమ్మెల్యే కుమారుడు ఇన్ని అరాచకాలు సీఎం కేసీఆర్‌కు తెలియదా?. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది...?. ఇంటెలిజెన్స్ మొత్తం ప్రతిపక్షాల ప్రజాపోరాటలపై నిఘాకే పరిమితమైందా..?’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

సెల్పీ వీడియోలో..
తాజాగా బయటకు వచ్చిన సెల్పీ వీడియోలో వనమా రాఘవేంద్ర తనతో వ్యవహరించిన తీరును రామకృష్ణ వివరించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా చెప్పారు. పిల్లలు లేకుండా తన భార్యతో హైద్రాబాద్ కు వస్తేనే తన సమస్యను పరిష్కరిస్తానని వనమా రాఘవేందర్ తనను బెదిరించారన్నారు. శ్రీలక్ష్మితో తన వివాహమై 12 ఏళ్లైనా ఎలాంటి పొరపొచ్చాలు లేవన్నారు. డబ్బులైతే ఇస్తాం కానీ, భార్యను ఎలా పంపాలని ఆయన ప్రశ్నించారు.నీ భార్యను నీవు ఎప్పుడు హైద్రాబాద్ కు తీసుకు వస్తావో అప్పుడు నీ సమస్య పరిష్కారం అవుతుందని తనను వనమా రాఘవేందర్ బెదిరించారన్నారు.

ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలని రామకృష్ణ ప్రశ్నించారు.రాజకీయ, ఆర్ధిక బలుపు ఉన్న వనమా రాఘవ లాంటి దుర్మార్గుడిని ఏం చేయాలని  రామకృష్ణ అడిగారు.  వనమా రాఘవ వల్ల ఎన్నో  కుటుంబాలు నాశనమయ్యాయని  రామకృష్ణ గుర్తు చేశారు. నీ సమస్య తీరాలంటే నీ భార్యను  తీసుకొని హైద్రాబాద్ కు రా.. అప్పటి వరకు  నీ సమస్య పరిష్కారం కాదని  రాఘవేందర్ తెగేసి చెప్పాడన్నారు. ఎవరి వద్దకు వెళ్లినా కూడా ఎవరూ కూడా ఈ సమస్యను పరిష్కరించలేరని రాఘవేందర్ తనను బెదిరించినట్టుగా రామకృష్ణ  వివరించారు. ఎదుటి మనిషి యొక్క బలహీనతల్ని గ్రహించి  రాఘవేందర్ తన పబ్బం గడుపుకొంటున్నాడని రామకృష్ణ చెప్పారు

PREV
click me!

Recommended Stories

Top 5 Churches in Hyderabad : కేవలం రూ.100 ఉంటే చాలు.. క్రిస్మస్ వేళ ఈ టాప్ చర్చిలను చుట్టిరావచ్చు
హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం