వనమా రాఘవేందర్ రావును అరెస్ట్ చేయాలి: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్

By narsimha lodeFirst Published Jan 6, 2022, 1:06 PM IST
Highlights

పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ రావును తక్షణమే అరెస్ట్ చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  డిమాండ్ చశారు.

హైదరాబాద్:  Palwanchaలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమై కొత్తగూడెం ఎమ్మెల్యే Vanama Venkateshwara rao కొడుకు వనమా రాఘవేందర్ రావును వెంటనే అరెస్ట్ చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

గురువారం నాడు గాంధీ భవన్ లో  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచకు చెందినRamakrishna కుటుంబం ఆత్మహత్యకు  పాల్పడిన కేసులో ఏ2 గా ఉన్న Vanama Raghavender Rao ను ఏ1 గా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. పేరుకు మాత్రమే రాష్ట్రంలో హోం మంత్రి ఉన్నాడని  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. హోంమంత్రిని ఈ విషయమై డిమాండ్  చేసి కూడా వృధానే అని Komatireddy Venkat Reddy చెప్పారు. పోలీస్ యంత్రాంగం ఏం చేస్తోందోనే విషయం dgpకి తెలుసా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. స్వంత పార్టీకి చెందిన నేత అని చూడకుండా వనమా రాఘవేందర్ రావును  అరెస్ట్ చేయాలని సీఎం kcr ను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

also read:రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్: రాఘవేందర్‌పై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్, వనమా ఇల్లు ముట్టడి

తన కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ఎమ్మెల్యే కొడుకు రాఘవేందర్ కారణమని రామకృష్ణ సెల్ఫీ వీడియో  విడుదల చేసిన  విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. మరో వైపు తనకు ఈ ఆత్మహత్యలతో సంబంధం లేదని వనమా రాఘవేందర్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారని... రాఘవేందర్ ఎక్కడున్నాడో పోలీసులు లోకేషన్ ట్రేస్ చేయలేరా అని భువనగిరి ఎంపీ ప్రశ్నించారు.

trs పరువు పోతోందోనే ఉద్దేశ్యంతోనే  వనమా రాఘవేందర్ రావును అరెస్ట్ చేయడం లేదని అర్ధమౌతోందని  వెంకట్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం ఉందా లేదా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నారు. ఏ 2 గా ఉన్న రాఘవేందర్ రావును ఏ1 గా మార్చాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. కొత్తగూడెం డీసీసీ అద్యక్షుడైతే వనమా రాఘవేందర్ రావును కాల్చి చంపాలని డిమాండ్ చేసిన విషయాన్ని  ఎంపీ గుర్తు చేశారు. వనమా రాఘవేందర్ రావుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే కొడుకులు దోచుకొంటున్నా, భూములు కబ్జాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అంటే సిగ్గుపడేలా టీఆర్ఎస్ సర్కార్  ప్రభుత్వ పనితీరు ఉందన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా రాఘవేందర రావుపై అనేక కేసులున్నాయన్నారు. ఇటీవల తాను ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వనమా రాఘవేందర్ రావు అరాచకాలను తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు.

ఎమ్మెల్యే కొడుకుకు ఒక రూల్, సామాన్యుడికి మరో రూల్ ఉంటుందా అని  ఎంపీ ప్రశ్నించారు.  నీ మనుమడిని ఎవరో ఏదో అన్నారని గగ్గోలు పెట్టారని, నలుగురు ఆత్మహత్య చేసకొంటే ఎందుకు స్పందించడం లేదని కేసీఆర్ ను ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

ఫార్మాసిటీ  కోసం రైతుల నుండి బలవంతంగా తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. ఫార్మా సిటీ పేరుతో రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తోంది ప్రభుత్వమని ఆయన విమర్శించారు. జడ్చర్లలోని ఫార్మాసిటీలో వెయ్యి ఎకరాల భూమి ఖాళీగా ఉందన్నారు. 

click me!