మునుగోడులో రాజగోపాల్ రెడ్డి తన ఓటు తాను వేసుకోలేరు.. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్‌దే అధికారం: రేవంత్ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Oct 12, 2022, 6:28 PM IST
Highlights

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలను ఓట్లు వేయమని అడుగుతున్నారని.. కానీ ఇక్కడ ఆయనకే ఓటు లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఇక్కడ ఓటు లేదు.. అసెంబ్లీలో నోరు లేదని విమర్శించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలను ఓట్లు వేయమని అడుగుతున్నారని.. కానీ ఇక్కడ ఆయనకే ఓటు లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఇక్కడ ఓటు లేదు.. అసెంబ్లీలో నోరు లేదని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి తన ఓటు తాను వేసుకోలేరని అన్నారు. 2023 కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు నియోజవకర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ది చేసుకునే బాధ్యత తనది అని  అన్నారు. 

మునుగోడు నియోజకవర్గానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని తీసుకొచ్చి.. ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. దిండి ప్రాజెక్టుకు 5 వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకటిస్తామని చెప్పారు. మునుగోడులో జూనియర్ కాలేజ్, చౌటుప్పల్‌లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. గొప్పోళ్లమని చెప్పుకునే నేతలు 2009కు ఎవరో కూడా తెలియదని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి 22 వేల మెజారిటీతో గెలిచి.. 22 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుకు అమ్ముడుపోయారని ఆరోపించారు. పార్టీని ఖతం చేయాలని అనుకుంటున్న నేతలు ఎంపీ, ఎమ్మెల్యే పదవులు ఇచ్చింది కాంగ్రెస్ అని అన్నారు. 

click me!