కాంగ్రెస్ రేవంత్ మరో షాకింగ్ డెసిషన్

Published : Mar 23, 2018, 04:25 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
కాంగ్రెస్ రేవంత్ మరో షాకింగ్ డెసిషన్

సారాంశం

అసెంబ్లీలోనే ఉన్నా.. రాజ్యసభ ఎన్నికల ్లో ఓటు వేయని రేవంత్ అదేమంటే.. నేను రాజీనామా చేసిన.. మాజీ ఎమ్మెల్యేనే అంటున్న రేవంత్ రాజ్యసభ పోటీ కోసం కాంగ్రెస్ పై వత్తిడి తెచ్చిన వైనం

తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు రేవంత్ రెడ్డి. కానీ కాంగ్రెస్ లో చేరకముందే తాను తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పుకుంటున్నారు. ఆ రాజీనామాను కూడా టిడిపి అధినేత చంద్రబాబుకు అమరావతిలో సమర్పించారు. అది వివాదాస్పదమైనప్పటికీ రేవంత్ మాత్రం తనకు తాను మాజీ ఎమ్మెల్యేను అన్న భావనలోనే ఉన్నారు. అంతేకాదు ఈరోజు మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు కూడా. అదేంటో తెలుసుకోవాలని ఉందా? చదవండి.

రాజ్యసభ ఎన్నికల్లో తొలుత కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలన్న ఆసక్తి చూపలేదు. కానీ.. రేవంత్ రెడ్డి పార్టీపై వత్తిడి తెచ్చి పోటీకి దింపినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతగా పోటీ చేయాల్సిందే అని పార్టీని వత్తిడి చేసి మరీ క్యాండిడేట్ ను రంగంలోకి దిగడంలో క్రియాశీల పాత్ర పోశించిన రేవంత్ రెడ్డి తీరా సీన్ కట్ చేస్తే... రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రెండు ఓట్లు రద్దు అయ్యాయి. అధికార పార్టీ వేసిన స్కెచ్ కారణంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ఇద్దరి ఓట్లు కాంగ్రెస్ కు లేకుండా పోయాయి. దీంతోపాటు ఓటు హక్కు ఉన్న రేవంత్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఈ విషయంలో ఆయన ఎందుకు ఓటు హక్కును వినియోగించుకోలేదన్నదానిపై సర్వత్రా చర్చ సాగుతున్నది.

దీనిపై రేవంత్ ఏమంటున్నారంటే..  ‘‘నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా.., అందుకే ఓటు హక్కు వినియోగించుకోట్లేదు’’ అని పేర్కొన్నారు. అయితే ఓటు హక్కు వినియోగించుకోకపోవడం అటుంచితే.. బలరాం నాయక్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. మరోవైపు ఇవాళ ఎన్నికల సమయంలో కూడా రేవంత్ ఉదయం నుంచీ అసెంబ్లీలోనే ఉన్నారు. మరి అసెంబ్లీలో ఉండి కూడా ఓటు వేయలేదు. ఒకవైపు పార్టీ కాంగ్రెస్, టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలంతా పోటీ పడి ఓటు హక్కు వినియోగించుకుంటుండగా... రేవంత్ మాత్రం ఓటు హక్కు వినియోగించుకోకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ మారినంతమాత్రాన ఓటు వేస్తే ఏం పొయింది అని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.  

PREV
click me!

Recommended Stories

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి CM రేవంత్ రెడ్డి బోనాలు | Secunderabad Ujjaini Mahankali Bonalu 2026
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తొలి దర్శనం | First Darshan of Ujjaini Mahankali Temple | Bonalu 2026