కేసిఆర్ పై ఖర్గే కు ఫిర్యాదు చేసిన కోమటిరెడ్డి, సంపత్

Published : Mar 23, 2018, 04:10 PM ISTUpdated : Mar 25, 2018, 05:27 PM IST
కేసిఆర్ పై ఖర్గే కు ఫిర్యాదు చేసిన కోమటిరెడ్డి, సంపత్

సారాంశం

అసెంబ్లీలో జరిగిన వ్యవహారాన్ని ఖర్గేకు వివరించిన నేతలు వీడియో పుటేజీ, నివేదిక అందజేత  

తమను అకారణంగా సభ నుంచి సస్పెండ్ చేశారని కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ వాపోయారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ లోక్ సభా పక్ష నేత మల్లికార్జున ఖర్గేతో వారు భేటీ అయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఖర్గేకు తమ సస్పెన్షన్ తాలూకు వివరాలు అందజేశారు.

రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఖర్గే ను కలిసి తెలంగాణ అసెంబ్లీ లో జరిగిన అంశాలను పూర్తిగా వివరించారు కోమటి రెడ్డి, సంపత్. చట్ట సభలోనే చట్ట వ్యతిరేకంగా తమను ఎలాంటి ఆధారాలు లేకుండా అసెంబ్లీ నుంచి బహిష్కరించారని వివరించారు.

12 వ తేదీన అసెంబ్లీ లో జరిగిన అన్ని రకాల వీడియోలు పేపర్ క్లిప్పింగ్స్, ఉద్దేశ్య పూర్వకంగా తమపై చర్యలు తీసుకున్న అంశాలను ఖర్గే కు అందజేశారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్.

వారి సస్పెన్షన్ అంశాన్ని సోమవారం నాడు లోకసభలో అంశాన్ని ప్రస్తావిస్తానని ఖర్గే హామీ వీరికి హామీ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu