Revanth Reddy: రేపు మధ్యాహ్నం తర్వాత పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీల నిరసనలు ఉండవు.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ

Published : Dec 06, 2021, 05:21 PM IST
Revanth Reddy: రేపు మధ్యాహ్నం తర్వాత పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీల నిరసనలు ఉండవు.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR), టీఆర్‌ఎస్ ఎంపీలపై.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు నామమాత్రపు నిరసనలు వ్యక్తం చేశారని విమర్శించారు.   

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR), టీఆర్‌ఎస్ ఎంపీలపై.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కరించేందుకు యత్నించడం లేదని ఆరోపించారు. సోమవారం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో బియ్యం నిల్వల అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్​కు ఫిర్యాదు చేద్దామంటే.. అపాయింట్​మెంట్​ లభించడం లేదని అన్నారు. రైతుల పక్షాన పోరాటంలో భాగంగా జంతర్​మంతర్​ వద్ద దీక్షకు దిగుతామని అన్నారు. పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు నామమాత్రపు నిరసనలు వ్యక్తం చేశారని విమర్శించారు. వాళ్లు ఫొటోలకు ఫోజులు ఇవ్వడమే తప్ప.. చేసిందేమి లేదన్నారు. నిరసనలు తెలుపుతున్నట్టు నటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. 

టీఆర్‌ఎస్ ఎంపీలు 10 నిమిషాలు నిరసన తెలిపి సెంట్రల్ హాల్‌లో సేద తీరుతున్నారని అభిప్రాయపడ్డారు. రైసు మిల్లర్లకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. రైసు మిల్లర్ల చేతిలో రాష్ట్ర ప్రభుత్వం బందీగా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 32 శాతం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలతో రైతులు ఆగమవుతున్నారని విమర్శించారు. 

Also read: TRS MPs walk out: పార్లమెంట్ ఉభయ సభల నుంచి టీఆర్‌ఎస్ ఎంపీల వాకౌట్..

ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర తప్పు ఉంటే కేసీఆర్ ఢిల్లీకి ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన కేసీర్.. ఫామ్‌మౌస్‌లో పడుకున్నారని విమర్శించారు. తనుకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రేపటి నుంచి పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీల నిరసనలు ఉండవని అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ సర్కారుకు ఆదేశాలు అందడమే అందుకు కారణమని అన్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత టీఆర్‌ఎస్ ఎంపీలు కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ పయనమవుతారని అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ ఒప్పందంలో భాగంగా టీఆర్‌ఎస్ ఎంపీలు వారి నిరసనను ముగిస్తారని చెప్పుకొచ్చారు. ఇదంతా కేంద్రం, రాష్ట్రం కలిసి ఆడుతున్న డ్రామా అని ఆరోపించారు. వారి విధానాలను రైతులు నిలదీయాలని కోరారు.  
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu