హైదరాబాద్‌లో మరో ఇద్దరిని బలికొన్న మందుబాబులు.. నార్సింగిలో జరిగిన ప్రమాదంలో దంపతుల మృతి..

Published : Dec 06, 2021, 04:39 PM ISTUpdated : Dec 06, 2021, 04:43 PM IST
హైదరాబాద్‌లో మరో ఇద్దరిని బలికొన్న మందుబాబులు.. నార్సింగిలో జరిగిన ప్రమాదంలో దంపతుల మృతి..

సారాంశం

హైదరాబాద్‌లో (Hyderabad) మందుబాబులు (Drunk people) బీభత్సం సృష్టించారు. మందుబాబుల వల్ల జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. 

హైదరాబాద్‌లో (Hyderabad) మందుబాబులు (Drunk people) బీభత్సం సృష్టించారు. మందుబాబుల వల్ల జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. ఆదివారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసిన ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా నగరంలోని నార్సింగిలో కారు బీభత్సం సృష్టించింది. నార్సింగ్ ఎంజీఐటీ వద్ద.. ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతూ టీఎస్ 07 ఈజెడ్ 6395 నెంబర్‌ గల బైక్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న దంపతులు ఇద్దరు మృతిచెందారు. 

ఈ ప్రమాదంలో మరణించిన వారిని రాజు, మౌనికలుగా గుర్తించారు. రాజు పాల వ్యాపారం చేస్తుంటాడని, నార్సింగి మున్సిపాలిటీలో రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తున్నారు. కారు నడుపుతున్న సంజీవ్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఉన్నారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకన్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనతో రాజు, మౌనిక కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వారు విలపిస్తున్న తీరు పలువురిని కలిచివేస్తుంది. ఈ ఘటన విషయం తెలుసకున్న మౌనిక సహచరులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Also read: హైదరాబాద్: అర్ధరాత్రి కారు బీభత్సం... ఇద్దరి ప్రాణాలు బలి

ఇక, ఆదివారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లో వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను అయోధ్యరాయ్‌, దేవేంద్రకుమార్‌ దాస్‌గా గుర్తించారు. వారిద్దరు నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి ఉప్పల్‌కు చెందిన రోహిత్ గౌడ్‌గా కనుగొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు అతడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కారును సీజ్ చేశామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

BRS Boycotts Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ఎదుట బిఆర్ఎస్ నాయకుల నిరసన| Asianet News Telugu
Kavitha Pressmeet: నా రక్తం ఉడుకుతోంది KCRపై CMరేవంత్ వ్యాఖ్యలను ఖండించిన కవిత | Asianet News Telugu