
ఢిల్లీ : ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ N.V. Ramana నేతృత్వంలోని Supreme Court Collegium తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సు చేసింది. వీరంతా న్యాయవాదులే కావడం విశేషం. Telangana High Courtకు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లలో.. న్యాయవాదులు కాసోజు సురేందర్, చాడ విజయ్ భాస్కర్ రెడ్డి, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, మీర్జా సైఫీయుల్లా బేగ్, నాచరాజు శ్రవణ్ కుమార్ వెంకట్ ఉన్నారు.
తెలంగాణ హైకోర్టుకు 12 మంది జడ్జీల నియామకానికి కొలీజియం సిఫార్సు చేసింది. న్యాయవాదుల నుంచి ఏడుగురు, న్యాయాధికారుల నుంచి ఐదుగురి పేర్లను జడ్జిలుగా ప్రతిపాదించింది. న్యాయాధికారుల జాబితాలో జి. అనుపమ చక్రవర్తి, ఎం.జి.ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ. సంతోష్ రెడ్డి, డి. నాగార్జునలు కొలిజీయం సిఫార్సు చేసిన వారిలో ఉన్నారు.
ఇదిలా ఉండగా, Schools ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని Telangana High Courtకు ప్రభుత్వం జనవరి 28న తెలిపింది. Corona పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు గత శక్రవారం నాడు విచారణ నిర్వహించింది. మేడారం జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. వారంతపు సంతలో కోవిడ్ జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ నెల 31 నుండి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు ఆరా తీసింది.
అయితే, అప్పటికి ఇంకా పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. కరోనా విచారణ సందర్భంగా ఆన్ లైన్ లో విచారణకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ Srinivasa Rao హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 3.16 శాతంగా నమోదైందని తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. రాష్ట్రంలో 77 లక్షల ఇళ్లలో సర్వే చేసి 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామన్నారు.
అంతేకాదు అనారోగ్యంగా ఉన్న వారికి కిట్స్ పంపిణీ చేశామన్నారు. అయితే ఈ కిట్స్ లో పిల్లల మెడిసిన్స్ లేవని న్యాయవాదులు ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తెచ్చారు. పిల్లలకు మందులు కిట్ల రూపంలో ఇవ్వకూడదని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పై పూర్తి నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. కరోనాపై విచారణను ఫిబ్రవరి 3 వ తేదీకి వాయిదా వేసింది.
ఇక, జనవరి 25న నైట్ కర్ఫ్యూ, ఆంక్షలు విధించేంతంగా కరోనా తీవ్రత లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు జనవరి 25న విచారణ చేపట్టింది. కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను మరోసారి విచారించింది. అయితే గత విచారణలో.. రాష్ట్రంలో కరోనా పరిస్థితులకు సంబంధించి హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో ఆర్‌టీపీసీఆర్ పరీ క్షలను పెంచాలని, రోజుకు లక్ష పరీక్షలు నిర్వ హించాలని తేల్చిచెప్పింది. ప్రజలు గుమిగూడ కుండా చూడాలని, ప్రజలు భౌతికదూరం పాటించేలా, మాస్క్‌ను తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.