పెద్దరికం చాటిన కాంగ్రెస్ ‘పెద్దలు జానారెడ్డి’

First Published Feb 9, 2018, 2:28 PM IST
Highlights
  • కాంగ్రెస్ లోఫర్ పార్టీ అయితే.. టిఆర్ఎస్ బ్రోకర్ పార్టీ అని ఎవరైనా అంటారు
  • అప్పుడేం చేస్తారు?
  • హుందాతనం, గౌరవం పెంచేలా రాజకీయనేతలు మాట్లాడాలి

ఎన్నడూ లేనిది శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డికి కూడా మస్తు కోపమొచ్చింది. కేటిఆర్ మాట్లాడిన భాష మీద జానారెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మిన్ను విరిగి మీద పడినా.. చలించని మనస్తత్వం కలిగిన జానారెడ్డి నోటినుంచి కూడా ఘాటు మాటలు వచ్చాయి. కేటిఆర్ ను ఉద్దేశించి జానారెడ్డి ఏం మాట్లాడిర్రో కింద చదువురి.

కేటీఆర్ మాటలు, భాష తీరు జగుప్సాకరంగా ఉంది. రాహుల్ మీద వాడిన పదజాలాన్ని నేను, సీఎల్పీ ఖండిస్తోంది. ఇది రాజకీయ అహం, దిగజారుడు తనానికి నిదర్శనం. ఎదుటి వారిని చులకన చేస్తే వారు ఉన్నతం అనుకోవడం మంచిది కాదు. ఏహ్యమైన మాటలు మాట్లాడడం టిఆర్ఎస్ వారికి అలవాటుగా మారింది.

రాజకీయాల్లో సంస్కారం , వ్యవహార తీరు ను ప్రతిసారీ గుర్తు చేస్తాను. కెసిఆర్ మాట్లాడిన, తెరాస వారు మాట్లాడినా, మా వాళ్ళు మాట్లాడినా వద్దని సలహా ఇచ్చాను. హుందాగా, సంయమనం తో ఉండాలని, వాస్తవానికి తగ్గట్టు మర్యాదగా, పద్ధతిగా ఉండాలని, వచ్చే తరానికి తెలిసే లా ఉండాలని చెప్పాను.

ఇలాంటి మాటల వల్ల సభ్యత, సంస్కారం నాశనమై.. రాజకీయ విలువలు దిగజారుతాయి. అవ్వే మాట్లాడాలంటే.. మేమూ మాట్లాడగలం. కాంగ్రెస్ లోఫర్ అంటే టిఆర్ఎస్ బ్రోకర్ పార్టీ అని ఎవరన్నా అంటే.. ఏం చెప్పగలం.. మీడియాలో పడటం కోసం ఆర్భాటం మంచిదికాదు.

కాలి గోరు తో పోల్చితే... కాళ్ళు పట్టుకున్న దాన్ని ఏమనాలి ? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పట్ల కనీసం గౌరవం ఇవ్వకపోవడం ప్రజలను బాధిస్తుంది.. ప్రజలు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ల పనుల్లో గొప్ప చూపించుకోవాలి.. అలాంటి కుసంస్కృతి చూపించే వారు రాజకీయాలకు తగరని ప్రజలు తీర్పు ఇస్తారు. 130 కోట్ల ప్రజల పార్టీ కి రాహుల్ నాయకుడు.. ప్రధాని అవ్వడానికి అవకాశం ఉన్నా వదిలేసిన నాయకుడు. గుజరాత్ లో మోడీని మూడు చెరువుల నీళ్లు  తాగించారు.. పప్పు కాదు పిప్పి పిప్పి చేసిన నాయకుడు రాహుల్.

నిన్నమొన్నటి దాకా రోజూ  నా సుట్టూ తిరిగినోళ్లు .. సీఎం లు, మంత్రులు అయ్యారని చులకనగా  చూస్తానా? వారి హోదాకు గౌరవం ఇవ్వాలి కదా? సవాల్ చేసిన వారికి.. మా పార్టీ నాయకుడు .. ఇప్పటికే సమాధానం ఇచ్చారు. 2019 లో కాంగ్రెస్ అధికారం లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

click me!