కేసిఆర్ పై అచ్చంపేటలో రెచ్చిపోయిన రేవంత్

First Published Dec 3, 2017, 7:32 PM IST
Highlights
  • గువ్వల బాలరాజు గబ్బిలమై అచ్చంపేటను పట్టిండు
  • పోలీసులు లాఠీని, టోపీని తాకట్టు పెడితే బాధపడక తప్పదు
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే యువతకు మళ్లీ ఉద్యోగాలు
  • కోదండరాంకు అనుమతిలేదు.. తాగి ఊగేందుకు అనుమతినా?
  • ఓయు మురళి ఆత్మహత్యకు కేసిఆరే కారణం

అచ్చంపేటలో జరిగిన సభలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ సిఎం కేసిఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. హైదరాబాద్ నుంచి భారీ ర్యాలీగా రేవంత్ అచ్చంపేట వెళ్లారు. మార్గమధ్యలో డిండిలో రేవంత్ కు స్వాగతం పలికారు. అక్కడి నుంచి అచ్చంపేట వరకు బైక్ ర్యాలీ జరిపారు. అచ్చంపేట సభలో రేవంత్ మాటలు... చదవండి.

కొత్త రాష్ట్రాన్ని కోతుల గుంపుకు అప్పజెప్పిన్రు. పరిపాలనలో విఫలం అయిన కేసీఆర్ ను గద్దెదింపాలి, నిరుద్యోగుల ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్ అధికారం లోకి రావాలి. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలి , అప్పుడే దేశంలో ప్రతి వర్గానికి మేలు జరుగుతుంది. ఢిల్లీ సుల్తాన్ల మీద పోరాటం చేసిన చరిత్ర అచ్చంపేట్ ప్రజలకు ఉంది. అచ్చంపేట కు గువ్వల గబ్బిలం పట్టుకుంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం మారిన రోజు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.  పోలీస్ మిత్రులు ఈ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది. టోపీని లాఠీని తాకట్టు పెట్టకండి. కేసీఆర్ పోలీసులతో రాజకీయం చేయాలని అనుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ తో గోక్కున్నోడు ఎవడూ బతికి బట్టకట్టలేదు.

టీడీపీ నేతలు అందరూ కాంగ్రెస్ లోకి వస్తే కేసీఆర్ కు కళ్ళు తిరిగి బైర్లు కమ్మినయి. అందుకే బీసీ ల జపం చేస్తున్నడు. ఉద్యమంలో చనిపోయిన బీసీలను పట్టించుకోవడం లేదు. 40 నెలల్లో ఏ రోజు కూడా బీసీల గురించి కేసిఆర్ పట్టించుకోలేదు. బీసీలు కాంగ్రెస్ వైపు కదులుతుంటే కేసీఆర్ కుర్చీ కదులుతుంది. తెలంగాణ ఉద్యమకారుడు స్వామి గౌడ్ కు మంత్రి పదవి ఇవ్వకుండా, తెలంగాణ వాదులను తరిమికొట్టిన మహేందర్ రెడ్డి కి మంత్రి పదవి ఇచ్చినవ్. బీసీలను చారులో కరువేపాకులా వాడుకుంటున్నారు. బీసీలు కేసీఆర్ వంకర బుద్ధిని అర్థము చేసుకుంటున్నారు. ప్రతి పేదవాడి బిడ్డ ఉన్నత చదువులు చదువుకువాలని కాంగ్రెస్ ఫీజు రియంబర్స్ మెంట్ చేసింది. కేసీఆర్ ఫీజు రియంబర్స్ మెంట్ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. తన ఒక్క కుటుంబానికి వెయ్యి కోట్లతో ఇళ్లు కట్టుకున్నాడు. కానీ బీసీలకు వంద కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు.

పేదలకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. తన ఇంట్లో మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. కోదండరామ్ కొలువుల కొట్లాటకు అనుమతి ఇవ్వడు కానీ.. సన్ బర్న్ పేరిట తాగి ఊగడానికి పర్మిషన్ ఇచ్చారు. అచ్చం.పెట్ లో ఎవరు గెలిస్తే ఆ పార్టీ నే అధికారం లోకి వస్తుంది. నన్ను కొడంగల్ లో ఎంత మెజారిటితో గెలిపిస్తారో, వంశీ కృష్ణ ను అంత మెజారిటీ తో గెలిపించండి.

మురళి ఆత్మహత్యకు కేసిఆరే కారణం

ఉస్మానియాలో మురళి ఆత్మహత్య కేసీఆర్ చేసిన హత్యనే. ఓయూ విద్యార్థి మురళి హత్య కేసులో కేసీఆర్ పై కేసు పెట్టి బొక్కల వేయాలి. మురళి కుటుంబానికి 10లక్షల నష్టపరిహారం ఇవ్వాలి, అతని కుటుంబాం లో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి అచ్చంపేట సభలో డిమాండ్ చేశారు.

 

click me!