చేవెళ్ల సభలో కాంగ్రెస్ నేతలకే రేవంత్ షాక్

First Published Feb 26, 2018, 6:44 PM IST
Highlights
  • చేవెళ్ల సభలో రేవంత్ హాట్ కామెంట్స్
  • కుస్తీ పోటీ.. కూచిపూడి కామెంట్స్ తో సొంత పార్టీ నేతలుక షాక్
  • చంద్రబాబు పాలన ముగింపు అంశాన్ని ప్రస్తావించకుండా రేవంత్ కామెంట్స్

చేవెళ్ల బస్సుయాత్ర అట్టహాసంగా జరుగుతున్న వేళ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన యువనేత రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ అధికార టిఆర్ఎస్ పార్టీపై ఒకవైపు నిప్పులు చెరుగుతూనే మరోవైపు సొంత పార్టీ నేతలకు కూడా గట్టి షాకే ఇచ్చారు. ఇంతకూ రేవంత్ ఏమన్నారో చదవండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం కాల్చుకుతింటుంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిగా మారాలి. టిఆర్ఎస్ సర్కార్ పై యుద్ధం చేయాలి.

మన జానన్న, ఉత్తమన్న మర్యాదగ మాట్లాడతారు. కేసిఆర్ పద్ధతి లేకుండా మాట్లాడతారు అని మన కార్యకర్తలు అంటుంటారు. మన అన్నలకు ఒక మాట చెబుతున్న.. అవుతలోడు కబడ్డీ ఆడితే మనం క్యారం బోర్డు ఆడితే చెల్లుద్దా? అవుతలోడు తొడగొట్టి కబడ్డీ కి రమ్మంటే క్యారం బోర్డు ఆడితే చెల్లుద్దా? అవుతలోడు కుస్తీ ఆడితే మనం కూచిపూడి ఆడుతామంటే చెల్లుద్దా? అవుతలోడు తొడకొడితే మనం దవడ పలగొట్టాలి.

కేసిఆర్ కత్తి యుద్ధమా? కర్ర యుద్ధమా ఏం చేద్దామంటే మనం దానికి సిద్ధపడాలి. కాంగ్రెస్ పార్టీని అడ్డగోలుగా తిడుతుంటే? రాహుల్ గాంధీని ముద్దపప్పు, సుద్దపప్పు అని ధూషిస్తుంటే మనం కౌంటర్ ఇవ్వాలా వద్దా?

చేవెళ్ల గడ్డలో పౌరుషం ఉంది. ఆనాడు కాంగ్రెస్ పాలనకు చేవెళ్ల నాంది పలికినట్లే ..ఇప్పుడు కేసీఆర్ పాలకు అంతం పలుకుతుంది ఈ చేవెళ్ల గడ్డ. కాంగ్రెస్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినప్పుడు కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారు. కేసీఆర్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటే.. కేటీఆర్ సెల్ఫీలు దిగుతున్నాడు. ఇప్పటికైనా ఆ పనులు మానుకుని వాస్తవాలు తెలుసుకోవాలి. నాడు కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్ట్ ల ముందు కేటీఆర్ సెల్ఫీలు తీసుకుంటున్నారు. పాలనను పక్కనబెట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పై విమర్శలు చేయడం సరికాదు. నాలుగేళ్లయినా ..కేసీఆర్ ఇచ్చిన 99 హామీల్లో ఏఒక్కటి నెరవేరలేదు.

మొత్తానికి తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్న కొందరు కాంగ్రెస్ నేతలను రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి మాట్లాడినట్లు కనబడుతున్నది. అందరూ ఏకమై టిఆర్ఎస్ పై పోరాడాలన్న కోణంలో రేవంత్ ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. అందుకోసమే కుస్తీ పోటీ.. కూచిపూడి కామెంట్స్ చేశారని చెబుతున్నారు. అయితే ఇంకో సందర్భంలో రేవంత్ చేవెళ్ల గొప్పతనాన్ని చెబుతూ.. గతంలో కాంగ్రెస్ పాలనకు చేవెళ్ల గడ్డ నాంది పలికిందన్నారు. కానీ.. గతంలో రేవంత్ ఇప్పటికీ అభిమానించే తెలుగుదేశం పార్టీ పార్టీని, చంద్రబాబు పాలనను ఇక్కడినుంచే వైఎస్ చరమగీతం పాడారన్న విషయాన్ని డిప్లమాటిక్ గా రేవంత్ చెప్పడం చర్చనీయాంశమైంది.

click me!