ఆ రెండు సర్వే నెంబర్ల మాటేమిటి ?

First Published Jun 23, 2017, 2:06 PM IST
Highlights

మియాపూర్ లో 6 సర్వే నంబర్ల మీద 600 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయ్యిందని షేర్ లింగంపల్లి ఎమ్మార్వో తిరుపతి రావు రిపోర్టు ఇచ్చిండు. కానీ సిఎం కెసిఆర్ కేవలం 4 సర్వే నంబర్ల మీద మాత్రమే విచారణ జరిపించారు. మిగిలిన రెండు సర్వే నెంబర్లలో ఉన్న భూముల ఆక్రమణల మాటేమిటి? సర్వే నంబర్ 44, 45 సర్వే నంబర్లలో ఉన్న 122 ఎకరాల భూమి ఏమైనది... ముఖ్యమంత్రి ఎందుకు పట్టించు కోవడం లేదో ప్రజలకు తెలియాలి.

వందల ఎకరాల భూ దోపిడి, వందల కోట్ల రూపాయల మార్పున కు సంభందించి గత 25 రోజులుగా చర్చ జరుగుతున్నా  ప్రభుత్వం మాత్రం ఉదాసీనంగా వ్యవహరించడం దారుణం.  ఇంత జరుగుతున్నా ఒక్క ఇంచు భూమి ఎక్కడికి పోలేదని కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు టిడిపి నేత రేవంత్ రెడ్డి. టిడిపి ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. భూ ఆక్రమణ దారుల పట్ల విధించే భూ ఆక్రమణ చట్టాన్ని కేసీఆర్  రద్దు చేయడం దారుణం.. ఇది భూ ఆక్రమణ దారులకు  ఊతం ఇవ్వడమే.. ముఖ్యమంత్రి అనుయాయులు తప్పించేందుకే ఈ నిర్ణయం.

 

Latest Videos

6 సర్వే నంబర్ల మీద 600 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయ్యిందని తిరుపతిరావు ప్రభుత్వానికి చెపితే కేవలం 4 సర్వే నంబర్ల మీద మాత్రమే విచారణ జరిపించారని విమర్శించారు. మిగిలిన సర్వే నంబర్ 44, 45 సర్వే నంబర్లలో ఉన్న 122 ఎకరాల భూమి ఏమైనది... ముఖ్యమంత్రి ఎందుకు పట్టించు కోవడం లేదో ప్రజలకు తెలియాలన్నారు. 44,45 సర్వే నంబర్లలో ఉన్న భూములు ఏవరి పేర్ల మీద ఉన్నాయో బహిర్గతం కావాలన్నారు. ఈ భూముల పట్ల కేసీఆర్ మౌనంగా ఉంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

 

కేశవ రావ్ సంభందించిన 50 ఎకరాల భూములను రద్దు చేసుకున్నట్టు ప్రకటించినందున అది అటవీ భూమి అని, అటవీ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం చట్టవ్యతిరేకమైన చర్య కాదా అని ప్రశ్నించారు. ఎందుకు కేశవ రావ్ పైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. భూములు ఆక్రమించుకున్నట్టు కేశవరావ్ నేరం ఒప్పుకున్న ఎందుకు పార్టీలో  కొనసాగిస్తున్నాడో కేసీఆర్ చెప్పాలన్నారు. నేరం చేసిన  కూడా వేదికల మీద కేశవ రావ్ ను ఎలా కూర్చోబెట్టుకుంటారు? ముఖ్యమంత్రే అలా వ్యవహరిస్తే విచారణ అధికారులు ఎలా ముందుకు వస్తారని ప్రశ్నించారు. 

 

ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని  113జీవో ద్వారా ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు. మియాపూర్ భూముల రిజిస్ట్రేషన్ లు రద్దు చేసి ఆ భూమి చుట్టూ కంచె నిర్మించి తెలంగాణా భూములని బోర్డ్ పెట్టాలి. దోషులను కఠినంగా శిక్షించాలని రేవంత్ డిమాండ్ చేశారు. .

click me!