(వీడియో) టివి రిపోర్టర్ అవతారమెత్తిన కానిస్టేబుల్

Published : Jun 23, 2017, 01:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
(వీడియో) టివి రిపోర్టర్ అవతారమెత్తిన కానిస్టేబుల్

సారాంశం

ఓ కానిస్టేబుల్ రిపోర్టర్ అవతారమెత్తారు. నమస్తే తెలంగాణ పత్రిక రిపోర్టర్ ఇసుక దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తూ లైవ్ కవరేజ్ ఇచ్చాడు. ఎలక్ర్టానిక్ మీడియాలో రిపోర్టర్లు ఎలా లైవ్ ఇస్తారో అదే మాదిరిగా లైవ్ కవరేజీ ఇచ్చాడు.  

 

 

 

 

 

న్యూస్ చానెళ్ల లైవ్ కవరేజ్ తో ప్రభావితుడయిన ఒక తెలంగాణ  కానిస్టేబుల్ కు రిపోర్టర్ అవతారమెత్తే అవకాశం దొరికింది. నమస్తే తెలంగాణ పత్రిక రిపోర్టర్ ఇసుక దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తూ లైవ్ కవరేజ్ ఇచ్చాడు. ఎలె క్ట్రానికి  మీడియాలో రిపోర్టర్ల లెవెల్లో  లైవ్ కవరేజ్ ఇచ్చాడు.

 

కరీంనగర్ జిల్లా చిన్నచింతకుంట మండల పోలీసు స్టేషన్ లో ఈ  కానిస్టేబుల్ లైవ్ వీడియో తీసి వాట్సాప్ లో విడుదల చేశాడు. స్థానికంగా పనిచేస్తున్న ‘నమస్తే తెలంగాణ’ రిపోర్టర్ శ్రీను అనే వ్యక్తి ఇసుక దందా చేస్తున్నట్లు ఆరోపిస్తూ ఆ వివరాలన్నీ సెల్ ఫోన్ లో వీడియో తీసి దానిని ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ప్రధాన కార్యాలయానికి షేర్ చేస్తానని చెప్పాడు.

 

రిపోర్టర్ శ్రీను ఇసుక దందా చేస్తూ ఎవరైనా ప్రశ్నిస్తే నేను రిపోర్టర్ ని, నా తడాఖా చూపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కానిస్టేబుల్ తన లైవ్ కవరేజీలో వివరించారు. ఇసుకను తరలించే ట్రాక్టర్ కు నెంబరు ప్లేటు కూడా లేదన్న విషయాన్ని లైవ్ లో వివరించాడు.

 

చేయాల్సిన పని వదిలేసి మీడియా రిపోర్టర్ అవతారమెత్తిన కానిస్టేబుల్ తీరు ఇటు మీడియా వర్గాల్లో, అటు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?