
తెలంగాణ సిఎం కేసిఆర్ పై మరోసారి వ్యక్తిగత విమర్శలకు దిగారు టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు మానసిక చికిత్స చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పిచ్చి పాలనకు తగిన బుద్ది చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.వరంగల్ ఆయన మాట్లాడారు.
తెలంగాణలో 40 నెలల కేసిఆర్ పాలనలో జనాలకు ఒరిగిందేమీలేదని టిడిపి నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రచారపు ఆర్భాటాలు తప్ప ఏమీలేదన్నారు. రాచరిక పాలన మాత్రం వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరాకుగా చేసి తన కుటుంబాన్ని మాత్రం బలోపేతం చేసుకున్నాడని విమర్శించారు.
జీవో 39,42 లు చట్ట వ్యతిరేకం, రాజ్యంగ విరుద్దమని స్పస్టం చేశారు. అయినా జీవో 39పై కోర్టులో కేసులు వేసింది టీఆర్ఎస్ నేతలేనని ఆరోపించారు. ఆ కేసులు కేసీఆర్ కు తెలిసి వేసారా? లేక తెలియకుండా వేసారా చెప్పాలన్నారు. ఒకవేళ కేసిఆర్ కు తెలియకుండా వేస్తే వారిని పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు.
రైతులను టీఆర్ఎస్ నాయకుల ముందు చేతులు కట్టుకొని నిలబడే విధంగా కేసీఆర్ చేస్తున్నాడని ఆరోపించారు. రైతు సమన్వయ సమితిల రూపంలో గ్రామంలో పెత్తనం చేలయించాలని చూస్తే చెట్టుకు కట్టేసి కొట్టండని పిలుపునిచ్చారు. లోపభూయిష్టంగా ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితిలను టీడీపీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. అవసరమైతే దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి