యోగి వస్తే ఏమవుతుంది.. అఖిలేష్ గెలిస్తే ఏం జరుగుతుందో చెప్పానంతే: ఈసీ నోటీసులపై రాజాసింగ్ వివరణ

Siva Kodati |  
Published : Feb 16, 2022, 07:44 PM IST
యోగి వస్తే ఏమవుతుంది.. అఖిలేష్ గెలిస్తే ఏం జరుగుతుందో చెప్పానంతే: ఈసీ నోటీసులపై రాజాసింగ్ వివరణ

సారాంశం

ఈసీ నోటీసులపై బీజేపీ (bjp) ఎమ్మెల్యే రాజాసింగ్ (raja singh) స్పందించారు. ఉజ్జయిని వెళ్లివచ్చాక ఈసీ నోటీసుపై సమాధానం ఇస్తానని ఆయన తెలిపారు. అఖిలేష్ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది.. యోగి ప్రభుత్వం  వస్తే ఏమవుతుంది అన్నదే తాను మాట్లాడానని రాజాసింగ్ వివరించారు. 

ఈసీ నోటీసులపై బీజేపీ (bjp) ఎమ్మెల్యే రాజాసింగ్ (raja singh) స్పందించారు. అఖిలేష్ ప్రభుత్వంలో మాఫియా రాజ్యం నడిచిందని.. యోగి ప్రభుత్వం వచ్చాక మాఫియాను బుల్డోజర్‌ను ఎత్తిపడేశారని రాజాసింగ్ అన్నారు. ఆ ఉద్దేశంతోనే తాను బుల్డోజర్ వ్యాఖ్యలు చేశానని  ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై కొందరు కుట్ర చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. యోగి ఆదిత్యనాథ్ మరోసారి సీఎం కాకూడదనే ఉద్దేశంతో కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు. యోగికి మద్ధతుగా వుండకుంటే మరోసారి హిందువులపై దాడులు జరుగుతాయని రాజాసింగ్ ఆరోపించారు. ఉజ్జయిని వెళ్లివచ్చాక ఈసీ నోటీసుపై సమాధానం ఇస్తానని ఆయన తెలిపారు. అఖిలేష్ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది.. యోగి ప్రభుత్వం  వస్తే ఏమవుతుంది అన్నదే తాను మాట్లాడానని రాజాసింగ్ వివరించారు. 

కాగా.. యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చిన రాజాసింగ్... యోగి ఆదిత్యనాథ్ కు (yogi adityanath) ఓటు వేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు రాజాసింగ్ మంగళవారం వీడియో విడుదల చేశారు. మంగళవారం జరిగిన రెండో విడత పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల అత్యధిక పోలింగ్ జరిగింది అని పేర్కొంటూ... యోగిని వ్యతిరేకిస్తున్న వారే ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. మూడో దశ పోలింగ్ లో హిందువులంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు.

రాజా సింగ్ ను తక్షణం అరెస్టు చేయాలి…
యూపీలో ఓటర్లను బెదిరిస్తూ రాజాసింగ్ బాహాటంగా వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయనను తక్షణం అరెస్టు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ రాజాసింగ్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని.. ఈసీ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. 

ఇదిలా ఉండగా, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM)  చీఫ్ Asaduddin Owaisi శ్రీరాముని వంశస్థుడని BJP MP బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా సింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది.  ఆయన కుమారుడు ప్రతీక్ భూషణ్ సింగ్  బీజేపీ అభ్యర్థిగా గోండా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

బ్రిజ్ భూషణ్ kaiserganj నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన కుమారుడు ప్రతీక్ విజయం కోసం ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓవైసీ తనకు Old friend అని చెప్పారు.తనకు తెలిసినంత వరకు ఆయన క్షత్రియుడు అని తెలిపారు. ఆయన Sri Rama వంశస్థుడు అని ఇరాన్ కు చెందిన వాడు కాదని చెప్పారు. ఓవైసీ పార్టీతో సమాజ్వాది పార్టీ పొత్తు కుదుర్చుకోనందుకు మండిపడ్డారు. Muslimsపై నాయకత్వం కోసం Akhilesh Yadav, ఓవైసీ పోట్లాడుకుంటున్నారు అన్నారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మోసగాడు అన్నారు. ఆయన తన తండ్రిని, తన అంకుల్ని మోసం చేశాడు అన్నారు. మోసం చేయడమే ఆయన పని అని దుయ్యబట్టారు. బీజేపీకి రాజీనామా చేసి ఎస్ పీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్యాని కూడా మోసం చేశారని ఆరోపించారు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu