మౌనంగానే తాగమని... పెగ్గు వదలి సాగమని

Published : Dec 30, 2016, 01:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
మౌనంగానే తాగమని... పెగ్గు వదలి సాగమని

సారాంశం

కొత్త సంవత్సరం వేడుకలపై పోలీసుల ఆంక్షలు

 

న్యూ ఇయర్ కు వెల్ కం చెప్పడానికి సిటీ రెడీ అవుతుంటే... చీర్స్ చెప్పడానికి మందుబాబులు సిద్ధమవుతుంటే  చావుకబురు చల్లగా చెబుతున్నారు పోలీసులు. సవాలక్ష ఆంక్షలు పెడుతూ నయా సాల్ జోష్ లేకుండా చేస్తున్నారు.

 

నూతన సంవత్సరం వేడుకల్లో  అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు.

 

అంతేకాదు న్యూ ఇయర్‌ పార్టీ జరుపుకోవాలంటే పోలీసుల నుంచి ముందస్తు అనుమతి కూడా తీసుకోవాలట.

 

ఎక్కడ డీజే సౌండ్ లు పెట్టొదట... ఒక వేళ అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

అలాగే, డ్రగ్స్‌ సరఫరా చేస్తే  ఈవెంట్‌ మేనేజర్‌ పై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈవెంట్‌కు వచ్చినవారిని ఇంటికి చేర్చే బాధ్యత ఈవెంట్‌ నిర్వహకులదే అని స్పష్టం చేశారు.

 

న్యూ ఇయర్‌  వేడుకలకు  డిసెంబర్‌ 31  రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు మాత్రమే జరుపుకోవాలని తెలిపారు.

 

డిసెంబర్ 31 న అత్యంత పకడ్బందీగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ఉంటుందన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే అదుపులోకి తీసుకుంటామన్నారు. ట్రిబుల్‌ రైడింగ్, ర్యాస్‌ డ్రైవింగ్‌ నిర్వహించే వారిపై కేసులు పెడతామని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం
IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు