కస్టమర్లను కర్రలతో కొట్టిన రెస్టారెంట్ సిబ్బంది.. రాజాసింగ్ ఆగ్రహం.. వీడియో వైరల్

Published : Jan 01, 2024, 03:01 PM IST
కస్టమర్లను కర్రలతో కొట్టిన రెస్టారెంట్ సిబ్బంది.. రాజాసింగ్ ఆగ్రహం.. వీడియో వైరల్

సారాంశం

డిసెంబర్ 31వ తేదీ రాత్రి అబిడ్స్ లోని ఓ రెస్టారెంట్ లో గొడవ చోటు చేసుకుంది. దీంతో అక్కడ పని చేస్తున్న సిబ్బంది కస్టమర్లను కర్రలతో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొత్త సంవత్సరం వేడుకలు ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు ప్రశాంతంగానే సాగాయి. కానీ కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్ లో సిబ్బంది కష్టమర్లపై కర్రలతో దాడి చేశారు. దీనిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

హైదరాబాద్ లోని అబిడ్స్ ఏరియాలో ఉన్న ఓ రెస్టారెంట్ లో డిసెంబర్ 31 అర్ధరాత్రి సమయంలో వెయిటర్లు కస్టమర్లపై కర్రలతో కొట్టారు. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అబిడ్స్ పోలీసులతో మాట్లాడారు. వెయిటర్లు, రెస్టారెంట్ యజమానులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను అరెస్టు చేయాలని పోలీసులను కోరారు.

అయితే కస్టమర్లు, హోటల్ సిబ్బందికి మధ్య గొడవ జరగానికి కారణమేంటనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కాగా.. ఈ ఘటనపైపోలీసులు రెస్టారెంట్ పై ఐపీసీ సెక్షన్ 324, 504, 509 కింద కేసు నమోదు చేశారు. అయితే రెస్టారెంట్ యాజమాన్యం కూడా దీనిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?