శిరీష డెడ్ బాడీకి రీపోస్టు మార్టం.. పొంతనలేని సమాధానాలు చెబుతున్న తండ్రి...

By SumaBala Bukka  |  First Published Jun 12, 2023, 10:45 AM IST

నర్సింగ్ విద్యార్థిని శిరీష మృతదేహానికి రీపోస్టు మార్టం నిర్వహించనున్నారు. హత్యకు ముందు ఆమె మీద అత్యాచారం జరిగిందా? లేదా? తేల్చడానికి మళ్ళీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. 


వికారాబాద్ : తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో కలకలం రేపిన శిరీష హత్య కేసులో మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు కలాపూర్ కు చేరుకుని కుటుంబీకుల నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శిరీష మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి.. డెడ్ బాడీని ఆమె అన్నకు అప్పగించిన సంగతి తెలిసిందే.

ఈ రోజు బంధువులు, కుటుంబసభ్యులు శిరీష అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో రీపోస్టు మార్టం అనడంతో ఆందోళన నెలకొంది. అయితే, శిరీష మీద చనిపోవడానికి ముందు అఘాయిత్యం జరిగిందా? లేదా? అనేది తెలుసుకోవడానికి రీపోస్టుమార్టం చేయాలని వారు అంటున్నారు. ఆమె హత్య కేసు దర్యాప్తులో భాగంగా.. తండ్రి, సోదరుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

Latest Videos

అయితే, తండ్రి పోలీసులతో ఒకరకంగా, గ్రామస్తులతో ఒకరకంగా సమాధానాలు చెబుతుండడంతో అతని మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శిరీష మీద బైటికి నుంచి వచ్చిన వ్యక్తులు దాడి చేశారా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీనిమీద గ్రామస్తులు మాట్లాడుతూ.. తమ గ్రామంలో ఇలాంటి నేరం జరగడం భయాందోళనలు కలిగిస్తుందని.. వెంటనే దీనిమీద అవసరమైన చర్యలు పోలీసులు తీసుకోవాలని కోరారు. 

శిరీష మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి.. అత్యాచారం చేసి, హత్య చేసిన బావ...

రీపోస్టుమార్టం కోసం ఫోరెన్సిక్, వైద్యుల బృందం కలాపూర్ బయలుదేరారు. ఈ పోస్టుమార్టం తరువాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

ఇదిలా ఉండగా, శిరీష హత్య కేసులో నిందితుడు బావే అయ్యే అవకాశాలున్నాయంటున్నారు పోలీసులు. శిరీష మృతదేహానికి రాత్రి పోస్టు మార్టం పూర్తయ్యింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నేడు కలాపూర్ లో శిరీష అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మృతికి వివాహేతర సంబంధమే కారణం అని పోలీసులు తేల్చారు. అక్క భర్తతో శిరీషకు వివాహేతర సంబంధం ఉందని.. ఈ నేపథ్యంలోనే ఆమె హత్య జరిగిందని అంటున్నారు.

శనివారం రాత్రి శిరీషను బైటికి రావాలని బావ పిలవడంతో ఆమె బైటికి వచ్చింది. అక్కడినుంచి ఆమెను తీసుకువెళ్లి.. ఆమె మీద అత్యాచారం చేసి, కళ్లలో పొడిచి హత్య చేశాడు. ఆ తరువాత సమీప కాలువలో పడేశారని సమాచారం. 

click me!