కాంగ్రెస్ సభకు అడ్డంకులు : రోడ్డుపై బారికేడ్లను నెట్టిపారేసిన రేణుకా చౌదరి.. నువ్వు ఎవడ్రా అంటూ పోలీసులపై ఫైర్

Siva Kodati |  
Published : Jul 02, 2023, 02:50 PM IST
కాంగ్రెస్ సభకు అడ్డంకులు : రోడ్డుపై బారికేడ్లను నెట్టిపారేసిన రేణుకా చౌదరి.. నువ్వు ఎవడ్రా అంటూ పోలీసులపై ఫైర్

సారాంశం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఆదివారం జరగనున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి భగ్గుమన్నారు. రోడ్డుపై వాహనాలకు అడ్డుగా పెట్టిన బారికేడ్లను తొలగించారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఆదివారం జరగనున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోందని హస్తం నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి భగ్గుమన్నారు. సభకు వచ్చే వాహనాలను , కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో రోడ్డుపై వాహనాలకు అడ్డుగా పెట్టిన బారికేడ్లను తొలగించిన రేణుకా చౌదరి .. కోపంతో ఊగిపోయారు.

మా ప్రజలు .. మేం వెళ్తున్నాం.. నువ్వు ఎవడ్రా ఆపడానికి అంటూ అక్కడున్న పోలీసులపై ఆమె భగ్గుమన్నారు. బారికేడ్లు పెడితే ఆగుతామా అంటూ నిలదీశారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని.. ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్నారని, వాళ్లు ఇస్తే ఎంత ఇవ్వకుంటే ఎంత అని రేణుకా చౌదరి ఫైర్  అయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలు నచుకుంటూ అయినా సభకు వస్తారని ఆమె పేర్కొన్నారు. 

Also Read: ఖమ్మం నుండే కేసీఆర్ పతనం: బీఆర్ఎస్ పై పొంగులేటి ఫైర్

అంతకుముందు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పతనం ఖమ్మం సభ నుండి  ప్రారంభం కానుందన్నారు. రాహుల్ గాంధీ  సభకు  అధికార బీఆర్ఎస్ అడ్డంకులు  సృష్టిస్తుందన్నారు.   అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు  సృష్టించిన రాహుల్ గాంధీ సభను విజయవంతం  చేస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు. నిన్న రాత్రి నుండి  భయానక వాతావరణం సృష్టిస్తున్నారని  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు.  గతంలో  ఖమ్మంలో  బీఆర్ఎస్ నిర్వహించిన సభను తలదన్నేలా  రాహుల్ గాంధీ సభ ఉంటుందని   పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు.

తమ పార్టీ నేత మువ్వా విజయ్ కుమార్ ను హత్య  చేస్తామని  వెలిసిన  పోస్టర్లపై  విజయ్ కుమార్ భార్య  ఖమ్మం సీపీని కలిసేందుకు  ప్రయత్నిస్తే  ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదని  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు.ఒక ఆడబిడ్డకు ఇచ్చే  మర్యాద ఇదేనా అని ఆయన  ప్రశ్నించారు. తమను బెదిరిస్తూ  వెలిసిన  పోస్టర్లపై   పోలీసుల తీరుపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం సభకు ఆర్టీసీ బస్సులు  ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చారన్నారు. జిల్లా సరిహద్దులో  ప్రైవేట్ వాహనాలు రాకుండా అడ్డుకుంటున్నారని పొంగులేటి ఆరోపించారు. జిల్లాలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వాహనాలు అడ్డుకుంటున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పై మండిపడ్డారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?