టీపీసీసీలో ఇప్పుడంతా సమర్థులే.. కాంగ్రెస్‌ను వీడిన వారు తిరిగి రావొచ్చు : రేణుకా చౌదరి

By Siva KodatiFirst Published Jul 2, 2021, 4:09 PM IST
Highlights

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకం నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు. టీపీసీసీ టీమ్‌లో సమర్థులు ఉన్నారని, ఖమ్మం జిల్లా నుంచే టీఆర్ఎస్‌పై తిరుగుబాటు ప్రారంభమవుతుందని ఆమె స్పష్టం చేశారు

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకం నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు. టీపీసీసీ టీమ్‌లో సమర్థులు ఉన్నారని, ఖమ్మం జిల్లా నుంచే టీఆర్ఎస్‌పై తిరుగుబాటు ప్రారంభమవుతుందని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కొవిడ్‌ నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని రేణుకా చౌదరి విమర్శించారు.

Also Read:పీసీసీ కూర్పుపై అసంతృప్తి: ఠాగూర్‌తో ఢిల్లీలో భట్టి భేటీ

కుటుంబ బాధ్యతలు తెలిసిన ప్రధాని అయితే.. ధరలు పెరిగితే కుటుంబాల పడే ఇబ్బందులు తెలిసేదంటూ సెటైర్లు వేశారు. చైనా కవ్విస్తున్నా ప్రధాని నరేంద్రమోడీ నోరు ఎందుకు మెదపడం లేదని రేణుకాచౌదరి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై దండయాత్ర ఖమ్మం నుంచే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఇతర పార్టీలకు వెళ్లిపోయిన కాంగ్రెస్ నేతలు తిరిగి సొంత గూటికి వస్తారని రేణుకా చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు.

click me!