అసెంబ్లీ ఇంచార్జీ బాధ్యతల నుండి తప్పించాలి: తరుణ్ చుగ్ కు బీజేపీ నేతల మొర

By narsimha lode  |  First Published Nov 21, 2022, 6:00 PM IST


అసెంబ్లీ  ఇంచార్జీ  బాధ్యతల నుండి  తప్పించాలని పలువురు  బీజేపీ నేతలు  తరుణ్ చుగ్ ను  కోరారు. పోలింగ్ బూత్ స్థాయిలో  కమిటీల  నియామకం చేయలేమని  పలువురు  నేతలు  చెబుతున్నారు. 


హైదరాబాద్: అసెంబ్లీ  ఇంచార్జీ  బాధ్యతల  నుండి  తమను  తప్పించాలని కోరుతూ పలువురు  బీజేపీ నేతలు  కోరుతున్నారు.  అసెంబ్లీ  నియోజకవర్గ  ఇంచార్జీలకు  పలు  బాధ్యతలను  పార్టీ  నాయకత్వం  అప్పగించింది. దీంతో ఈ బాధ్యతలు  తాము  చేయలేదని  పలువురు  అసెంబ్లీ  నియోజకవర్గాల  ఇంచార్జీలు  కోరుతున్నారు.

అసెంబ్లీ నియోజకవర్గాల  ఇంచార్జీలుగా  ఉన్న  నేతలు  ఆయా  అసెంబ్లీ  నియోజకవర్గాల్లో  పోలింగ్  బూత్‌లవారీగా కమిటీల  వారీగా  నియమించాలని  కోరింది.  పోలింగ్ బూత్  స్థాయిల్లో  22  మందితో  కమిటీని ఏర్పాటు చేయాలని  బీజేపీ  నాయకత్వం  ఆదేశించింది. పోలింగ్  బూత్ ల వారీగా  కమిటీలను  ఏర్పాటు చేయకపోతే  నియోజకవర్గ బాధ్యతల నుండి తప్పిస్తామని  బీజేపీ తెలంగాణ  రాష్ట్ర  ఇంచార్జీ  తరుణ్  చుగ్  చెప్పారు. దీంతో  ఈ  బాధ్యతలు  తాము నిర్వహించలేమని  పలువురు  బీజేపీ  నేతలు  చెబుతున్నారు. తాము  వచ్చే  అసెంబ్లీ  ఎన్నికల్లో  పోటీ  చేసేందుకు  సమాయత్తం  అవతున్న  తరుణంలో  పోలింగ్  బూత్  స్థాయిల్లో  కమిటీల నియామకం సాధ్యం  కాదని బీజేపీ  నేతలు  చెబుతున్నారు. ఇదే  విషయమై  బీజేపీ  నేతలు  తరుణ్  చుగ్ , బీజేపీ  తెలంగాణ  రాష్ట్ర  అధ్యక్షుడు  బండి  సంజయ్ కు  తేల్చి  చెప్పారు.  అయితే  ఆయా అసెంబ్లీ  నియోజకవర్గాలకు  ఇంచార్జీలుగా  ఉన్న  నేతలు  పోలింగ్  బూత్ స్థాయిల్లో  కమిటీలను  ఏర్పాటు  చేయాల్సిందేని  తేల్చి  చెప్పారు. 

Latest Videos

వచ్చే  ఏడాదిలో  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి  ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో  రాష్ట్రంలో  అధికారాన్ని  కైవసం  చేసుకోవాలని కమలదళం  వ్యూహత్మకంగా  అడుగులు  వేస్తుంది.  దీంతో  మూడు  రోజులుగా  హైద్రాబాద్  శివారులోని  షామీర్  పేటలోని  ఓ రిసార్ట్స్ లో  శిక్షణ  తరగతులు నిర్వహిస్తున్నారు. నిన్న  మధ్యాహ్నం  శిక్షణ  తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ  తరగతులకు  హాజరైన  బీజేపీ నేతలు  అసెంబ్లీ  నియోజకవర్గ  ఇంచార్జీ  బాధ్యతల  నుండి  తమను  తప్పించాలని  కోరారు.
 

click me!