
December 31 Restrictions: రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం, అటు పోలీసు విభాగం అప్రమత్తమైంది. న్యూ ఇయర్ వేడుకల వేడుకలపై ఆంక్షలు కఠినంగా అమలు చేస్తోన్నట్టు తెలిపారు. ఒమిక్రాన్ కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఆదేశించారు. న్యూఇయర్ వేడుకల పేరుతో రోడ్లపై రచ్చ చేస్తే తాట తీస్తామంటున్నారు హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. కరోనా నిబంధనాలను పాటిస్తూ.. న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనవరి 2 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని డీజీపీ తెలిపారు.
ఈ క్రమంలో.. Cyberabad Traffic డీసీపీ విజయ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. మద్యం మత్తులో కస్టమర్లను వారి గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత సంబంధింత పబ్ లు, బార్లదేనని, వారికి క్యాబ్ లేదా డైవర్లను అందించాల్సిన బాధ్యత వారిదేనని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్.
పరిమితికి మించిన మద్యం సేవించకుండా..వారిని ఇంటికి సురక్షితంగా తీసుకెళ్లాలన్నారు.
Read Also: తాగి వాహనాలు నడిపితే పబ్‌లదే బాధ్యతే: తెలంగాణ హైకోర్టు
నూతన సంవత్సరం సందర్భంగా పోలీసులు నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. న్యూఇయర్ వేడుకల్లో భాగంగా.. సైబరాబాద్ కమిషనరెట్ పరిధిలో డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకు రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తోన్నారని తెలిపారు. మద్యం తాగి వాహనాలు సేవిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని, M.V. చట్టంకింద కేసు నమోదు చేయబడుతుందని హెచ్చరించారు. మొదటిసారి మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడితే రూ. 10,000 వేల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించబడుతుందన్నారు. రెండోసారి పట్టుబడిన వారికి రూ. 15, 000 జరిమానాతో పాటు రెండు ఏండ్ల జైలు శిక్ష, మూడు నెలల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. మైనర్లు వాహనం నడపకూడదని, రూల్స్ ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 183, 184 కింద కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ హెచ్చరించారు.
Read Also: విజయవాడలో బ్లేడ్ బ్యాచ్... గంజాయి మత్తులో వీరంగం
న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. కరోనా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ లు విస్తరిస్తున్న క్రమంలో..పలు ఆంక్షలు, నిబంధనలు విధించింది. పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు.
కరోనా 19 నిబంధనలు:
- ఇవెంట్ నిర్వాహకులు వేదిక లోపల భౌతిక దూరం పాటించేలా చూసుకోవాలి.
- రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి మాత్రమే వేడుకలకు అనుమతి.
- ఇవెంట్ కు వచ్చే వ్యక్తులను స్కాన్ చేయడానికి ఎంట్రీ పాయింట్ వద్ద IR థర్మామీటర్లు/థర్మల్ స్కానర్‌లను ఏర్పాటు చేయాలి.
- రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి మాత్రమే వేడుకలకు అనుమతి.
- పబ్ లు, రెస్టారెంట్ల వద్ద స్థానికులను ఇబ్బంది పెట్టవద్దు.
- ఈవెంట్లకు పరిమితికి మించి పాస్ లను ఇవ్వకూడదు.
- మాస్క్ లేని వ్యక్తులను వేదికలోకి అనుమతించరాదు. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తులు మాస్క్ ధరించకుంటే 1,000 జరిమానా విధించబడుతుంది.
- నిర్వహకులు, సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకోవాలి.
- బహిరంగ కార్యక్రమాలలో DJ అనుమతించబడదు.
- సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కింద 45 డెసిబుల్స్ ఉండే శబ్ద స్థాయిలను ఖచ్చితంగా పాటించాలి.
- ఈవెంట్లకు పరిమితి మించి పాసులను జారీ చేయవద్దని హెచ్చరించారు.
- అసభ్యత లేదా అశ్లీల డ్రెస్సింగ్ లేదా అశ్లీల నృత్యాలు అనుమతించబడవు.
- ఈవెంట్‌లో లేదా పార్టీల్లో డ్రగ్స్ పట్టుబడితే కఠిన చర్యలు.
- ఈవెంట్లలో జనాల్లోకి సింగర్స్ వెళ్లవద్దు.
- జంటల కోసం నిర్వహించే కార్యక్రమాలలో మైనర్‌లను అనుమతించకూడదు.
- కార్యక్రమ వేదిక వద్ద బాణాసంచా ప్రదర్శించవద్దని లేదా తుపాకీలను అనుమతించవద్దని నిర్వాహకులను హెచ్చరిస్తున్నారు.
- బార్‌లు & రెస్టారెంట్లలో లైవ్ బ్యాండ్ నిర్వహించకూడదు.
- కోవిడ్ రూల్స్ ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.