మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్...

By AN TeluguFirst Published Jul 23, 2021, 4:54 PM IST
Highlights

వరద నీరు చేరి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.  దీంతో అధికారులు నదీపరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పెరిగిన వరద కారణంగా జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసీకి భారీగా వరద నీరు పెరిగింది.

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాలూ చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ లోనూ వర్షాల కారణంగా మూసీ పొంగి పొర్లుతోంది.

వరద నీరు చేరి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.  దీంతో అధికారులు నదీపరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పెరిగిన వరద కారణంగా జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసీకి భారీగా వరద నీరు పెరిగింది.

దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. చాదర్ఘాట్,  ముసరాంబాగ్, శంకర్ నగర్ కాలనీలో ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని జిహెచ్ఎంసి అధికారులు హెచ్చరించారు. 

మూసీ వరదకి ఇళ్లకు మధ్య రెండు అడుగులు మాత్రమే దూరం ఉండడంతో కాలు బయట పెడితే మూసీలో కొట్టుకుపోయే ప్రమాదముంది. మూసీ కి క్యాపింగ్ వేస్తామని నేతలు అధికారులు చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. 

click me!