నకిలీ వెబ్‌సైట్ల‌తో చీటింగ్: హైద్రాబాద్‌లో ఆరుగురు అరెస్ట్

By narsimha lodeFirst Published Jul 23, 2021, 3:48 PM IST
Highlights

ఫేక్‌వెబ్‌సైట్ల పేరుతో డబ్బులను కొల్లగొడుతున్న ఆరుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు పోలిన మాదిరిగాన నకిలీ వెబ్ సైట్లతో ప్రజల నుండి డబ్బులను  వసూలు చేసిన ముఠా నుండి భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.


హైదరాబాద్: నకిలీ వెబ్‌సైట్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఆరుగురిని సైబరాబాద్ పోలీసులు శుక్రవారంనాడు అరెస్ట్ చేశారు. అసలు వెబ్‌సైట్లను పోలిన వెబ్‌సైట్లను పోలిన వెబ్‌సైట్లను సృష్టించి  ప్రజల నుండి డబ్బులు కొల్లగొడుతున్నారు. శుక్రవారంనాడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఈ ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఫేక్ వెబ్ సైట్ సృష్టియించి ఫర్నిచర్, గ్రాసరిస్‌ను తక్కువ ధరలు, అమ్మకాల పేరుతో మోసానికి పాల్పడ్డారు. నకిలీ వెబ్ సైట్లతో అమాయకుల నుండి డబ్బులు తీసుకొని ఈ ముఠా మోసం చేసిందని ఆయన చెప్పారు.. నిందితుల నుండి రూ.40 లక్షలు నగదు, 20 డెబిట్ కార్డులు, 6 బ్యాంక్ పాస్ బుక్స్, 2 లాప్ టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. దేశంలో పలు రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కాలంలో సైబర్ నేరాల విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉ:డాలని సీపీ సజ్జనార్ కోరారు. 

click me!