హైదరాబాద్ కు రెడ్ అలర్ట్.. రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు..

By SumaBala Bukka  |  First Published Jul 26, 2023, 9:38 AM IST

తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 


హైదరాబాద్ :  తెలంగాణలోని హైదరాబాదులో అతి భారీ వర్షాలు కురవనన్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.  బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు బంద్ ప్రకటించింది. ఆఫీసులు, కంపెనీలు సైతం  దీని ప్రకారమే పనివేళలను సరి చేసుకోవాలని సూచించింది.  రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

హైదరాబాదుకు ప్రత్యేకించి ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. జోన్లవారీగా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను అలర్ట్ చేసింది జిహెచ్ఎంసి. హైదరాబాదులోని చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, ఎల్బీనగర్ జోన్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.  ఇక కుకట్పల్లి జోన్ కు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. కూకట్పల్లి జోన్ లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

Latest Videos

https://telugu.asianetnews.com/telangana/several-colonies-flooded-due-to-heavy-rains-in-hyderabad-lns-rydxt0

గంటలో మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసే సూచనలు ఉన్నాయని కొన్నిచోట్ల ఐదు నుంచి పది సెంటీమీటర్లు కూడా వర్షం కురవచ్చని.. అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. వర్షంతో పాటు భారీగా గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు.. హైదరాబాదులోని నాలాల కెపాసిటీ రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకునే వరకు మాత్రమే ఉన్నాయి. వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగా భారీ వర్షాలు కురిస్తే రోడ్లపైకి నీరు భారీగా చేరుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.

మంగళవారం నాడు సోమవారంతో పోలిస్తే వరుణుడు కాస్త శాంతించాడు. అనేకచోట్ల తేలికపాటి వానతో సరిపెట్టాడు. కాగా బుధవారం, గురువారాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలతో నగరంలోని రహదారులన్నీ జలమయమయి గాలులతో చెట్లు నేలకూలే ప్రమాదం ఉందని తెలుపుతున్నారు.  విద్యుత్ స్తంభాలు దెబ్బ తినడంతో కరెంటు సరఫరాలో అంతరాయాలు చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. 

అయితే జోన్ల పరిధిలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇక శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉండొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు రెండు నుంచి మూడు లేదా ఐదు సెంటీమీటర్ల దాకా వర్షపాతం కురిసే వీలుందని చెబుతోంది. హైదరాబాద్ వర్షాలపై.. మొబైల్ యాప్ ద్వారా అలర్ట్ సందేశాలను ఎప్పటికప్పుడు అధికారులు పంపుతున్నారు.

click me!