బాబోయ్.. ఆ టీచర్ కిడ్నీలో 156 రాళ్లు.. డాక్టర్ల సాహసం..

By SumaBala BukkaFirst Published Dec 17, 2021, 7:57 AM IST
Highlights

కర్ణాటకలోని హుబ్లీకి చెందిన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు బసవరాజు కడుపునొప్పి రావడంతో పరీక్షలు  చేయించుకున్నాడు. ఈ పరీక్షల్లో కిడ్నీల్లో పెద్ద మొత్తంలో Kidney stones ఉన్నట్లు గుర్తించారు. ఆయనకు సాధారణంగా మూత్రకోశం సమీపంలో ఉండాల్సిన కిడ్నీ అందుకు బదులుగా కడుపు దగ్గరలో ఉందని దీన్ని ectopic kidney అంటారని డాక్టర్ చంద్రమోహన్ తెలిపారు.

బంజారా హిల్స్ :  దేశంలోనే మొట్టమొదటి సారిగా పెద్దాపరేషన్ చేయకుండా లాప్రోస్కోపీ, ఎండోస్కోపీలతోనే Keyhole surgery నిర్వహించి ఓ వ్యక్తి కిడ్నీలో ఉన్న 156 రాళ్లను ప్రీతి యూరాలజీ, Kidney Hospital doctors విజయవంతంగా తొలగించారు. గురువారం బంజారాహిల్స్లోని తాజ్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి యూరాలజిస్ట్ డాక్టర్ వి.చంద్రమోహన్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

కర్ణాటకలోని హుబ్లీకి చెందిన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు బసవరాజు కడుపునొప్పి రావడంతో పరీక్షలు  చేయించుకున్నాడు. ఈ పరీక్షల్లో కిడ్నీల్లో పెద్ద మొత్తంలో Kidney stones ఉన్నట్లు గుర్తించారు. ఆయనకు సాధారణంగా మూత్రకోశం సమీపంలో ఉండాల్సిన కిడ్నీ అందుకు బదులుగా కడుపు దగ్గరలో ఉందని దీన్ని ectopic kidney అంటారని డాక్టర్ చంద్రమోహన్ తెలిపారు.

ఇలాంటి కిడ్నీలోని రాళ్ళను తీయడం చాలా పెద్ద ప్రయత్నమే  అని.. అయితే, శరీరంపై పెద్ద  కోతకు బదులు కేవలం కీహోల్ మాత్రమే చేసి తీసేశామని ఆయన వివరించారు. ఈ రోగికి రెండేళ్ల ముందే రాళ్ళు ఏర్పడడం మొదలై ఉంటుందని అయితే ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని ఉన్నట్లుండి నొప్పి రావడంతో పరీక్షలు చేయించుకున్నారు అని అన్నారు. 

అనుమానాస్పద స్థితిలో గురుకుల అధ్యాపకురాలు మృతి..

ఇలాంటి ఒక విచిత్రమైన ఘటన ఈ యేడాది ఏప్రిల్ లో జరిగింది. గర్భం దాల్చిన విషయం కూడా తెలియకుండానే ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని బోస్టన్ నగరానికి చెందిన 38 ఏళ్ల మెలిస్సా సర్జ్‌కాఫ్‌కు మార్చి 8న తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది.

అయితే కిడ్నీలోంచి రాళ్లు పడిపోయే ముందు వచ్చే నొప్పిగా సర్జ్‌కాఫ్ భావించి వెంటనే బాత్రూంలోకి పరుగులు తీసింది. అనంతరం బాత్రూంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చి.. షాక్‌కు గురైంది. తాను గర్భందాల్చిన విషయం కూడా తనకు తెలియదని ఆమె చెప్పడంతో మీడియా ప్రతినిధులు ఖంగుతున్నారు. కొన్ని నెలలుగా రుతుస్రావం కాకపోయినప్పటికీ.. పొట్ట పరిమాణం మాత్రం సాధారణంగానే ఉండటంతో తాను ప్రెగ్నెంట్ అయినట్లే లేదని మెలిస్సా చెప్పారు.

ఇదే సమయంలో మార్చి 8న అకస్మాత్తుగా వచ్చిన నొప్పులను పురుటి నొప్పులుగా గ్రహించలేకపోయానని ఆమె తెలిపారు. కిడ్నీలోంచి రాళ్లు పడిపోయే ముందు వచ్చే నొప్పులుగా భావించానని.. అయితే జననాంగాల నుంచి రక్తం రావడాన్ని చూసి.. పీరియడ్స్ కారణంగా వచ్చే నొప్పులుగా అంచనా వేసినట్టు సర్జ్‌కాఫ్ పేర్కొన్నారు.

బాత్‌రూంలోకి పరిగెత్తగా.. జననాంగాల నుంచి రక్తంతోపాటు మాంసం ముద్ద కూడా రావడాన్ని చూసి.. ఏదో అవయం తన శరీరం నుంచి బయటికి వస్తోందని భ్రమపడ్డానని చెప్పారు. చివరికి తన భర్త డొనాల్డ్ క్యాంప్‌బెలే.. అసలు విషయం చెప్పాడని మెలిస్సా వెల్లడించారు. గట్టిగా అరవడంతో బాత్రూంలోకి వచ్చిన డొనాల్డ్ క్యాంప్.. తాను మగబిడ్డకు జన్మనిచ్చినట్టు చెప్పాడంతో తాను షాక్‌కు గురయ్యానని ఆమె పేర్కొన్నారు.

డాక్టర్లు సైతం ఆ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్టు చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. కాగా, బ్రెజిల్‌కు చెందిన 20 ఏళ్ల మహిళ, బ్రిటన్‌కు చెందిన 32 ఏళ్ల మరో మహిళ కూడా ఇదే విధంగా ప్రసవించారంటూ ఇటీవల కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

click me!