మునుగోడులో బీజేపీ ఓటమికి కారణాలివే.. వ్యూహాత్మక తప్పిదాలు.. చౌటుప్పల్, చండూర్‌లో అంచనాలు తలకిందులు!

By Mahesh KFirst Published Nov 7, 2022, 2:43 PM IST
Highlights

మునుగోడులో బీజేపీ విజయం ఖాయమని పార్టీ వర్గాలు భావించాయి. పార్టీ ఓటమికి స్పష్టంగా కొన్ని పొరపాట్లు జరిగాయని ఆ పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. వ్యూహాత్మక తప్పిదాలు, క్యాంపెయిన్‌లో లోపాలతోపాటు చౌటుప్పల్, చండూర్‌లో పార్టీ తీరును కచ్చితత్వంతో అంచనా కట్టకపోవడమేనని పేర్కొన్నాయి.
 

హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పై బీజేపీ ఓడిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలో మునుగోడులో నామమాత్ర ప్రదర్శన ఇచ్చిన బీజేపీ ఈ సారి మాత్రం బలమైన పోటీ ఇచ్చింది. చాలా మంది బీజేపీ శ్రేణులు తమ పార్టీ గెలుస్తుందని దృఢమైన అభిప్రాయానికి వచ్చాయి కూడా. కానీ, ఈ ఓటమికి బీజేపీ స్వయంగా చేసుకున్న కొన్ని తప్పులు కూడా ఉన్నాయని తెలుస్తున్నది. ఈ విషయాన్నీ బీజేపీ వర్గాలే పేర్కొనడం గమనార్హం. బీజేపీ లోపలివర్గాలు ఈ ఓటమికి గల కారణాలను ఇలా చర్చిస్తున్నాయి.

బీజేపీ కొన్ని బలమైన వ్యూహాత్మక తప్పిదాలు చేసిందని, క్యాంపెయిన్‌లోపాల కారణంగా పరాజయం పాలవ్వక తప్పలేదని తెలుస్తున్నది. అందుకే పార్టీలోని కొందరు సీనియర్లకు బీజేపీ ఓటమిని ముందే పసిగట్టినట్టూ తెలుస్తున్నది. అంతేకాదు, వారు బీజేపీ గెలుపునకు చేయాల్సిన కొన్ని పనులను విజయవంతం చేయలేకపోయిందనీ పేర్కొంటున్నారు. కొన్ని కార్యక్రమాలను రద్దు చేయకుండా చేపట్టి ఉంటే బీజేపీ గెలిచి ఉండేదని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.

Also Read: మునుగోడులో టీఆర్ఎస్ విజయానికి కారణాలు.. టాప్ పాయింట్స్

పార్టీ రాష్ట్ర కార్యవర్గానికి చెందిన సీనియర్ పార్టీ నేత ఒకరు ఈ ఓటమి గురించి మాట్లాడుతూ, ‘కొన్ని తప్పులు జరిగాయి. అందులో కొన్నింటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేసి ఉండాల్సినవి కావు’ అని అన్నారు.

ఈ సారి బీజేపీ చేసిన పెద్ద తప్పిదాల్లో ఒకటి.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సమావేశాన్ని రద్దు చేయడం అని వివరించారు. జేపీ నడ్డా బహిరంగ సభను అక్టోబర్ 31న ప్లాన్ చేశారని, కానీ, దాన్ని రద్దు చేశారని తెలిపారు. ఈ సభ రద్దు పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు తప్పుడు సంకేతాలను ఇచ్చిందని చెప్పారు. దీన్ని సరిపుచ్చుకోవడానికి బీజేపీ చేసిన మరో నిర్ణయం ఇంకా చెత్తగా ఉండిందని అన్నారు.

జేపీ నడ్డా సభ రద్దును ఓవర్‌కమ్ చేయడానికి నవంబర్ 1వ తేదీ అంటే ఎన్నికల ప్రచారానికి చివరి రోజున మండల్ స్థాయి బహిరంగ సమావేశాలను బీజేపీ హామీ ఇచ్చింది. కానీ, వాటిని కూడా విజయవంతంగా చేయలేకపోయిందని పేర్కొన్నారు. ఈ తప్పిదాలు అసలు జరిగి ఉండాల్సింది కాదని ఆయన తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి, నియోజకవర్గ నాయకత్వానికి మధ్య కూడా పొంతన కుదరలేదని ఎత్తిచూపారు.

Also Read: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోవర్టు రాజకీయాలు చేశారు.. పాల్వాయి స్రవంతి సంచలన కామెంట్స్

బయటి నుంచి వచ్చిన వారు అక్కడ కుదురుకోవడానికి కూడా ఎక్కువ సమయం పట్టిందని వివరించారు. అలాగే, అంతర్గత సిస్టమాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆయన వివరించారు. నాయకత్వం వారి బాధ్యతలను నిర్వర్తించడం విఫలమయ్యారని పేర్కొన్నారు.

చౌటుప్పల్, చండూర్ మండలాల్లో బీజేపీకి మెజార్టీ ఓట్లు వస్తాయని, ఇవి మిగతా మండలాల్లోని లోటును పూడ్చి రాజగోపాల్ రెడ్డిని విజయతీరానికి చేరుస్తాయని బీజేపీ అంచనా వేసిందని పేర్కొన్నారు. ఈ మండలాల్లో అంతా బీజేపీకి సవ్యంగానే ఉన్నదని మండల ఇంచార్జీలు తెలిపారని, వాస్తవానికి అది సరైన రిపోర్టు కాదని వివరించారు. క్షేత్రస్థాయిలో రిపోర్టును చూడటంలో వారు పొరపడ్డారని పేర్కొన్నారు. అలాగే, టీఆర్ఎస్‌తో పోటీగా డబ్బు, లిక్కర్ పంపిణీ చేయలేకపోవడం అని విమర్శ, ఆరోపణలతో కూడి వాదన కూడా చేశారు.

click me!