సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కాలినడకన వెళ్తున్న మహిళలను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి..

Published : Nov 07, 2022, 02:23 PM IST
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కాలినడకన వెళ్తున్న మహిళలను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి..

సారాంశం

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రాయపోల్‌లో కాలినడకన వెళ్తున్న కూలీలను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కూలీలు మృతిచెందారు.

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రాయపోల్‌లో కాలినడకన వెళ్తున్న మహిళలను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో గాయపడిన మహిళా కూలీలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను శ్యామల, కవితగా గుర్తించారు. 

మహిళలు రాయపోల్ మండల కేంద్రంలో కూలీ పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో దౌల్తాబాద్ నుంచి గజ్వేల్ వైపు వెళ్తున్న లారీ మహిళలపైకి అదుపు తప్పి దూసుకొచ్చిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు, మృతుల కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?