సాలార్ పురియా సత్వ సంస్థలో ఈడీ సోదాలు: హైద్రాబాద్, బెంగుళూరులలో తనిఖీలు

By narsimha lodeFirst Published Nov 7, 2022, 2:30 PM IST
Highlights

సాలార్ పురియా సత్వ రియల్ ఏస్టేట్ సంస్థపై ఈడీ  అధికారులు ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నారు.హవాలా ఆరోపణలు రావడంతో సోదాలు  నిర్వహిస్తున్నట్టుగా సమాచారం.

న్యూఢిల్లీ:సాలార్ పురియా సత్వ రియల్ ఏస్టేట్  సంస్థలపై ఈడీ అధికారులు సో మవారంనాడు  సోదాలు  నిర్వహించారు.బెంగుళూరు, హైద్రాబాద్ లలో  ఏక కాలంలో ఈడీ అధికారుల  సోదాలు నిర్వహిస్తున్నారు.కంపెనీ ఎండీ బిజయ్ అగర్వాల్ ,డైరెక్టర్ మహేష్  నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.హవాలా ఆరోపణల నేపథ్యంలో  సోదాలు నిర్వహిస్తున్నారని  సమాచారం.  హైద్రాబాద్ లోని రాయదురగ్గంలో , బెంగుళూరులోని డిఫెన్స్ కాలనీలో ఈడీ అధికారులు  సోదాలు   నిర్వహిస్తున్నారని  ప్రముఖ  తెలుగు  న్యూస్ చానెల్  ఎన్టీవీ కథనం ప్రసారం   చేసింది.

గతంలో కూడ  హైద్రాబాద్ కేంద్రంగా ఉన్న కొన్ని రియల్ ఏస్టేట్ సంస్థలపై ఈడీ అధికారులు  సోదలు  నిర్వహించారు.ఈ ఏడాది ఆగస్టు 12న హైద్రాబాద్ లోని  రెండు ప్రముఖ రియల్ ఏస్టేట్ సంస్థలపై ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ రెండు  సంస్థలతో మరో   పెద్ద నిర్మాణాన్ని  చేపట్టినట్టుగా అధికారులు గుర్తించారు. దీనికి  సంబంధించి  కొన్ని కీలక డాక్యుమెంట్లను ఈడీ  అధికారులు  స్వాధీనం చేసుకున్నారని అప్పట్లో  మీడియా రిపోర్టు  చేసిన విషయం తెలిసిందే.

ఈడీతో  పాటు ఐటీ శాఖ అధికారులు కూడ కొన్ని రియల్ ఏస్టేట్ సంస్థలపై హైద్రాబాద్  కేంద్రంగా సోదాలు  నిర్వహించారు. ఈ సోదాల సమయంలో రియల్ ఏస్టేట్ సంస్థలో జరిగిన లావాదేవీలపై ఆరా తీశారు.

click me!