రియాల్టర్ సూర్యప్రకాశ్ పై హైదరాబాద్ లోనే దాడి... అవమానాలు భరించలేకే.. కుటుంబంతో కలిసి...

By Bukka SumabalaFirst Published Aug 23, 2022, 7:59 AM IST
Highlights

తెలంగాణలో కలకలం సృష్టించిన రియాల్టర్ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ లోనే అతని మీద దాడి జరిగిందని తెలుస్తోంది. 

నిజామాబాద్ : రియాల్టర్ కుటుంబం బలవన్మరణం ఘటనలో రోజులు గడిచిన కొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సంఘటన మీద దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి.  ఆదివారం నిజామాబాద్ లోని ఓ హోటల్ లో సూర్య ప్రకాష్… అతని భార్య, పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న ఈయనకు భాగస్వాములతో కొన్ని రోజులుగా విభేదాలున్నాయి. ఇరవై రోజుల కిందట కొందరు అతని మీద కొందరుదాడి చేశారు. తనకు జరుగుతున్న అవమానాలు ఒత్తిళ్లను తట్టుకోలేకే.. కుటుంబం అంతా చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

పార్ట్నర్స్ పై కేసు… 
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సూర్యప్రకాష్ భాగస్వాములైన వెంకట్ సందీప్, కళ్యాణ్ చక్రవర్తి, కిరణ్లపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు హైదరాబాదుకు, మరొకరు విశాఖపట్నానికి చెందిన వారని గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసుల బృందం సోమవారం హైదరాబాద్ కు వెళ్ళింది. నిందితుల్లో ఒకరికి పోలీసు అధికారులతో సంబంధాలున్నాయని బంధువులు ఆరోపించారు. సూర్యప్రకాష్ పై దాడికి సంబంధించి పోలీసులు సాంకేతిక ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు.  

నిజామాబాద్‌లో షాకింగ్ ఘటన.. హోటల్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..

ఇల్లు, రియల్ రియల్ ఎస్టేట్ ఆఫీసుల వద్ద నెల రోజులకు సంబంధించిన సీసీ ఫుటేజీని సేకరించే పనిలో ఉన్నారు. పదిహేను రోజుల నుంచి ఈ కుటుంబం హైదరాబాదులో లేకపోవడంతో.. ఎవరెవరు ఇంటికి, ఆఫీసుకు వచ్చి వెళ్లారు.. అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. సూర్య ప్రకాష్ ఫోన్ చనిపోయేవరకు ఆన్లోనే ఉంది.  ఆయనకు వచ్చిన ఫోన్స్ లిఫ్ట్ చేయలేదని గుర్తించారు. వాటిలో అధికంగా ఎవరు చేశారనేది చూస్తున్నారు. వాట్సాప్ చాటింగ్ లను పరిశీలిస్తున్నారు.

విలాసవంతమైన జీవితం…
సూర్య ప్రకాష్ ఆదిలాబాద్లోని ఆస్తులు అమ్ముకుని రియల్ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాడు. ఈయనకు ఓ విల్లా ఉన్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరో అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. పిల్లలను పెద్ద పాఠశాలలో చదివిస్తున్నట్లుగా తెలుస్తోంది. వ్యాపారం నేపథ్యంలో తెచ్చిన డబ్బులకు వడ్డీలు పెరిగి పోయినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లుగా ఓ పోలీస్ అధికారి చెప్పుకొచ్చారు.

శనివారమే ఆఖరు…
సూర్య ప్రకాష్ కుటుంబం చనిపోయినట్లు ఆదివారం మధ్యాహ్నం గుర్తించారు. ఆ కుటుంబం హోటల్ గదిలో నుంచి శనివారం ఉదయం 11 గంటల తర్వాత ఎవరికీ కనిపించలేదు. తలుపులు తీయలేదు. అదేరోజు సాయంత్రం ఓ బంధువు వీరికోసం హోటల్ కి వచ్చాడు.  అయితే తలుపు తీయకపోవడంతో నిద్రపోయి ఉంటారు.. అని వెళ్ళిపోయాడు. ఈ విషయాలను పోలీసులు గుర్తించారు. దీని ప్రకారం శనివారం సాయంత్రంలోపే వీరు చనిపోయి ఉంటారా? అని అనుమానిస్తున్నారు. శవపరీక్షలో ప్రాథమికంగా ముగ్గురూ విషం కారణంగానే చనిపోయినట్లు గుర్తించారు. అది ఏ విషం అనేది తేలాల్సి ఉంది. చెత్తబుట్టలో కేక్, కత్తి పడేసి ఉండడంతో అందులో విషం కలుపుకుని తిని, చనిపోయి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. 

click me!