మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. హైద‌రాబాద్ లో నిర‌స‌న‌లు

By Mahesh RajamoniFirst Published Aug 23, 2022, 7:00 AM IST
Highlights

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్  మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో హైద‌రాబాద్ లో అర్థ‌రాత్రి నిర‌స‌న‌లు చెల‌రేగాయి. పలు పోలీసు స్టేష‌న్ల‌లో ఆయ‌న‌పై ఫిర్యాదులు సైతం న‌మోద‌య్యాయి. 
 

హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రవక్త మహమ్మద్‌ను కించపరిచే విధంగా వీడియోను విడుదల చేయడంతో అర్ధరాత్రి నగర పోలీసు కమిషనర్ సివి ఆనంద్ కార్యాలయం ముందు, పట్టణంలోని ఇతర ప్రాంతాలలో నిరసనలు చెలరేగాయి. హాస్యనటుడు మునావర్ ఫరూఖీ, అతని తల్లిని కూడా "కామెడీ" అని పిలిచిన సింగ్, అతనిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అనేక మంది ప్రజలు వీధుల్లోకి వ‌చ్చి నిరసనలు తెలిపారు. తాజాగా ఆయ‌న విడుద‌ల చేసిన ఓ వీడియోలో ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు దారితీశాయి. ఈ వీడియో శ్రీ రామ్ ఛానెల్ తెలంగాణ‌లో అప్‌లోడ్ చేయబడింది. ఇప్పుడు సస్పెండ్ చేయబడిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ఇటీవల టీవీలో చెప్పిన కొన్ని విషయాలను రాజాసింగ్ సైతం ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తోంది. నూపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో తీవ్ర దుమార‌మే రేగింది. అనేక ముస్లిం దేశాలు ఖండించడంతో అంతర్జాతీయంగా భార‌త్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 

కాగా, స్టాండప్ కామిక్ మునావర్ ఫరూఖీ గత వారం నగరంలో ఒక ప్రదర్శనను నిర్వహించడానికి అనుమతించబడ్డారనే  విష‌యం తెలిసిందే. ముందే రాజాసింగ్ ఈ షోను అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించారు. దాడులు చేస్తామ‌ని కూడా పేర్కొన్నారు. దీంతో ఆగస్ట్ 20న పూర్తి పోలీసు రక్షణతో శిల్పకళా వేదిక వద్ద ఫరూకీ ప్రదర్శన ఇచ్చాడు. ఈ క్ర‌మంలోనే షోకు ఆటంకం కలిగించకుండా ఉండేందుకు బీజేపీ ఎమ్మెల్యేను కూడా గృహనిర్బంధంలో ఉంచారు. సోమవారం నాడు రాజాసింగ్ వీడియో వైర‌ల్ కావ‌డంతో అర్ధరాత్రి బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముందు నిరసనలు చెలరేగాయి. రాజా సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు నిరసనలు కూడా తెలిపారు. కాంగ్రెస్ నేత రషెద్ ఖాన్ నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా తన మద్దతుదారులతో ఫిర్యాదు చేసేందుకు దబీర్‌పురా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. రాజా సింగ్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద సుమారు 300 మంది నిరసన తెలిపారు.

Massive Erupted in Many Parts of After MLA Used Derrogatory Words On S.A.W . pic.twitter.com/Yin66vvJEB

— A18 Telangana News (@a18_news)

 

One More Complaint against BJP MLA T at Charminar PS. pic.twitter.com/MnW9demg5v

— Arbaaz The Great (@ArbaazTheGreat1)

 

click me!