
హైదరాబాద్ జీడిమెట్లలోని ఓ బయోటెక్ కంపెనీలో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటన ముగ్గురుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు.. జీడిమెట్లలోని శ్రీధర్ బయోటెక్ కంపెనీలో ఒకేసారి ఐదు రియాక్టర్‌లు పేలాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.