అమిత్ షాకు చెప్పులు అందించిన బండి సంజయ్!.. వీడియోతో రచ్చ చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు.. కేటీఆర్ సెటైర్లు

Published : Aug 22, 2022, 10:32 AM IST
అమిత్ షాకు చెప్పులు అందించిన బండి సంజయ్!.. వీడియోతో రచ్చ చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు.. కేటీఆర్ సెటైర్లు

సారాంశం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించిన సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఆయనకు చెప్పులు అందించినట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ వీడియో షేర్ చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు.. ఎందుకింత బానిసత్వం? అంటూ బండి సంజయ్‌ను ట్రోల్ చేస్తున్నారు. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించిన సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఆయనకు చెప్పులు అందించినట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిని షేర్ చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు.. గుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా ? అంటూ బండి సంజయ్‌ను ప్రశ్నిస్తున్నారు. భవిషత్తులో అమిత్ షా కాళ్ల దగ్గర తెలంగాణను తాకట్టు పెడతారనడానికి ఈ ఘన ఉదాహరణ అంటూ పోస్టులు చేస్తున్నారు. ఎందుకింత బానిసత్వం? అంటూ బండి సంజయ్‌ను ట్రోల్ చేస్తున్నారు. 

ఈ వీడియోపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. గుజరాతీ గులాములను.. ఢిల్లీలో నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని తెలంగాణ సమాజం గమనిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం నిలపడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని చెప్పారు. 

‘‘ఢిల్లీ "చెప్పులు" మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న  నాయకున్ని -  తెలంగాణ  రాష్ట్రం గమనిస్తున్నది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది. జై తెలంగాణ!’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

 

 మరి తనపై టీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న విమర్శలపై బండి సంజయ్‌ ఏ విధంగా స్పందిస్తారనేది వేచిచూడాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KTR Speech: కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తాం.. ఎదురు దెబ్బలు పట్టించుకోము | Asianet News Telugu
Hyderabad Police Commissioner VC Sajjanar Celebrate New Year at Charminar HYD | Asianet News Telugu