రుద్రంగి తహసీల్దార్ కార్యాలయంలో తాళికట్టి మహిళ నిరసన: ఆర్టీఓ విచారణలో కీలక విషయాలు

By narsimha lode  |  First Published Jul 1, 2021, 4:13 PM IST

 రుద్రంగి తహసీల్దార్ కార్యాలయంలో తాళి కట్టి నిరసన వ్యక్తం చేసిన ఘటనపై ఆర్డీఓ శ్రీనివాస్ విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.


సిరిసిల్ల: రుద్రంగి తహసీల్దార్ కార్యాలయంలో తాళి కట్టి నిరసన వ్యక్తం చేసిన ఘటనపై ఆర్డీఓ శ్రీనివాస్ విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.ఈ ఘటనపై మీడియాలో వార్తలు రావడంతో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్  సీరియస్ అయ్యారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్ ను ఆదేశించారు. 2011లోనే బాధితురాలి భూమి చేతులు మారిందని గుర్తించామని ఆర్డీఓ తెలిపారు. అయితే దీనికి సంబంధించిన రికార్డులు అందుబాటులో లేవని ఆర్డీఓ గుర్తించారు. 

also read:తహసీల్దార్ ఆఫీస్ కు తాళి కట్టి మహిళ నిరసన... జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సీరియస్

Latest Videos

undefined

అయితే భూమి చేతులు మారిన విషయంలో ఏం జరిగిందనే దానిపై  లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఆర్డీఓ అభిప్రాయపడ్డారు.ఈ విషయమై  దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ నెల 3వ తేదీలోపుగా విచారణ జరిపి కలెక్టర్ కు నివేదిక అందిస్తామన్నారు. మరోవైపు తహసీల్దార్ కార్యాలయంలో  అవకతవకలు చోటు చేసుకొన్నట్టుగా గుర్తించామన్నారు.

రుద్రంగి తహసీల్దార్ కార్యాలయ గేటుకు తాళి కట్టి  మంగ అనే మహిళ బుధవారం నాడు నిరసనకు దిగింది. రాజేశం, మంగ దంపతులకు 2 ఎకరాల భూమి ఉండేది. అయితే మంగ భర్త రాజేశం మరణించాడు. భర్త పేరున ఉన్న భూమిని తన పేరున మార్పించుకొనేందుకు మంగ ప్రయత్నిస్తోంది. కానీ అధికారులు ఈ భూమిని తన పేరున మార్చలేదు.

click me!