
తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించరా అని ప్రశ్నించారు. డంపింగ్ యార్డ్, రోడ్డు సమస్యలపై నిలదీస్తాననే తనను పిలవలేదని ఆయన అన్నారు. ప్రతీ కార్యక్రమంలో ఇదే విధంగా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తున్నారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. దీనిపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు.
Also Read:రాజకీయ వ్యాఖ్యలు చేయను, ప్రజాసమస్యలపైనే దృష్టి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కాగా, కొద్దిరోజుల క్రితం తన నియోజకవర్గ పరిధిలో నిర్వ హించిన అభివృద్ధి కార్యక్రమాలపై తనకు సమా చారం ఇవ్వకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధి కారులపై చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గత మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమానికి తనకు సమాచారం ఇవ్వలేదన్నారు.