ఏపీ మహేశ్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ కన్నెర్ర.. భారీ జరిమానా , కారణమిదే..?

By Siva Kodati  |  First Published Jul 1, 2023, 7:22 PM IST

ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్‌‌కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ జరిమానా విధించింది. సైబర్ సెక్యూరిటీని గాలికొదిలేసిన కారణంగా రూ.65 లక్షల జరిమానా విధించింది


ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్‌పై ఆర్బీఐ కన్నెర్ర చేసింది. ఈ బ్యాంకుకు రూ.65 లక్షల జరిమానా విధించింది. వివరాల్లోకి గతేడాది జనవరి 24న మహేశ్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసిన ఓ నైజీరియన్ గ్యాంగ్ రూ.12.48 కోట్లను వివిధ ఖాతాలకు మళ్లించింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. బ్యాంక్ యాజమాన్యం సైబర్ సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేల్చింది. 

ఈ క్రమంలో నైజీరియన్ గ్యాంగ్.. బ్యాంక్ సిబ్బందికి మెయిల్స్ పంపి సర్వర్‌ను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ .. ఆర్‌బీఐ గవర్నర్ వద్ద ప్రస్తావించారు. మహేశ్ బాంక్ లైసెన్స్ రద్దు చేయాలని ఆనంద్ సిఫారసు చేశారు. దీనిపై రంగంలోకి దిగిన కేంద్ర బ్యాంక్.. లైసెన్స్ రద్దు చేయడం సాధ్యం కాకపోవడంతో జరిమానా విధించింది. అంతేకాదు.. సైబర్ సెక్యూరిటీ విషయంలో లోపాల కారణంగా జరిమానాను ఎదుర్కొన్న తొలి బ్యాంక్‌‌గా ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ నిలిచింది. 
 

Latest Videos

click me!