చరిత్రను వక్రీకరించే ‘రజాకార్‌’ సినిమాను నిషేధించాలి.. ఎంబీటీ

రజాకర్ చిత్రం చరిత్రను వక్రీకరించేలా ఉందని, సమాజంలో మతసామరస్యాన్ని ప్రమాదంలో పడేసేలా ఉందని ఎంబీటీ ఆరోపించింది. 

Google News Follow Us

హైదరాబాద్ : 'రజాకార్' చిత్రం వక్రీకరించిన చరిత్ర ఆధారంగా రూపొందిందని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉందని మజ్లిస్ బచావో తహ్రీక్ (ఎంబీటీ) ఆరోపించింది. 'రజాకార్' చిత్రాన్ని నిషేధించాలని సోమవారం నాడు పిలుపునిచ్చింది.

1948లో హైదరాబాద్ స్టేట్‌ను ఇండియన్ యూనియన్‌లో విలీనానికి సంబంధించిన "కల్పిత" కథల ఆధారంగా ఈ చిత్రం ఇరు వర్గాల ప్రజల మధ్య వైరాన్ని సృష్టించేందుకు మాత్రమే రూపొందించబడిందని ఎంబీటీ పేర్కొంది.

ఇలాంటి రెచ్చగొట్టే సినిమాను తెరకెక్కించే ప్రయత్నం సమాజంలో మరింత ఉద్రిక్తతలకు దారి తీస్తుంది.. కాబట్టి సెన్సార్ బోర్డ్ ఈ చిత్రాన్ని ఆమోదించకూడదని ఎంబీటీ ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్ అన్నారు. "శాంతి, మత సామరస్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంటే, ఆ సినిమా విడుదలకు ముందే ఆపాలి" అని డిమాండ్ చేశారు. 

Read more Articles on