Telangana New DGP: ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ డీజీపీ అంజనీ కుమార్ పై ఎన్నికల కమిషన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన స్థానంలో కొత్త డీజీపిని నియమించారు. నూతన డీజీపీ ఎవరంటే..?
Telangana New DGP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌పై ఎలక్షన్ కమిషన్(ఈసీ) వేటు విధించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఇంకా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే అధికారికంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో భేటీ కావడాన్ని తప్పుబట్టింది. ఈ కారణంతో డీజీపీ అంజనీకుమార్ ను సస్పెన్షన్ వేటు విధించింది ఈసీ. పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు రాకముందే రేవంత్‌రెడ్డితో భేటీ అయి కావడమే సస్పెన్షన్ వేటుకు కారణం. డీజీపీతో పాటు అదనపు డీజీలు మహేష్ భగవత్, సంజయ్ జైన్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఈసీ.
ఇదిలా ఉంటే.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) అంజనీ కుమార్ సస్పెండ్ అయిన కొన్ని గంటల తర్వాత.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవి గుప్తాను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్‌కు చెందిన IPS రవిగుప్తా డిసెంబర్ 2022లో అవినీతి నిరోధక బ్యూరో (ACB) డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్ జనరల్ (విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్) అదనపు బాధ్యతలను కూడా నిర్వహించారు.