నిజామాబాద్‌ జిల్లాలో విషాదం: పెళ్లి పీటలెక్కాల్సిన రవళి ఆత్మహత్య

By narsimha lode  |  First Published Dec 11, 2022, 9:17 AM IST

నిజామాబాద్ జిల్లా నవీపేటలో  ఆదివారం నాడు తెల్లవారుజామున రవళి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.ఇవాళ ఉదయం 10 గంటలకు రవళికి వివాహం జరగాల్సి ఉంది.  ఈ సమయంలో  రవళి ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో విషాదం నింపింది.


నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఆదివారం నాడు విషాదం చోటు చేసుకుంది.  మరికొన్ని గంటల్లో వివాహం చేసుకోవాల్సిన  యువతి  తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. యువవతికి  నిజామాబాద్ జిల్లా నవీపేటలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన రవళి అనే యువతి  తన ఇంట్లో  ఆత్మహత్యకు పాల్పడింది.  కుటుంబ సభ్యులు  పెళ్లి పనుల్లో  బిజీగా ఉన్న సమయంలో ఈ  ఘటన చోటు చేసుకుంది. తన  గదిలోకి వెళ్లిన రవళి  ఆత్మహత్యకు పాల్పడింది. కాబోయే భర్త  వేధింపులు భరించలేక రవళి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

శనివారం నాడు రాత్రి కూడా  రవళికి కాబోయే భర్త ఫోన్ చేశాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఆదివారం నాడు తెల్లవారుజామున  నాలుగు గంటల సమయంలో  రవళి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రవళి కుటుంబ సభ్యుల ఆరోపణలపై వరుడి తరపు కుటుంబసభ్యులు ఎలా స్పందిస్తారో  చూడాలి.ఇవాళ ఉదయం  10 గంటలకు పెళ్లి కూతురుగా పెళ్లి పీటలు ఎక్కాల్సిన  రవళి ఆత్మహత్య చేసుకోవడంతో  కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Latest Videos

పెళ్లి కోసం రవళి ఇంటి ముందు  ఘనంగా ఏర్పాట్లు చేశారు.  రవళి  ఆత్మహత్య చేసుకోవడంతో  ఇంటి వద్ద ఏర్పాటు చేసిన  పెండ్లి పందిరిని తొలగించారు.  పెళ్లికి ముందు శనివారంనాడు ఏర్పాటు చేసిన హల్దీ  ఫంక్షన్ లో  రవళి  తన బంధువులతో కలిసి ఉత్సాహంగా  డ్యాన్స్ చేసింది.  ఆదివారంనాడు తెల్లవారుజామునే రవళి ఆత్మహత్య చేసుకుంది.  శనివారం నాడు రాత్రి  వరుడు రవళికి ఫోన్ చేసినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఫోన్ తర్వాతే రవళి  ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకొని ఉంటుందని  కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఈ విషయమై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు.  మృతురాలి తండ్రి ఫిర్యాదు మేేరకు పోలీసులు  వరుడిపై  కేసు నమోదు చేశారు. 

నేను తప్పు చేయలేదు:  పెళ్లి కొడుకు సంతోష్

తాను ఎలాంటి తప్పు చేయలేదని  పెళ్లి కొడుకు సంతోష్ చెప్పారు. ఆగస్టు నుండిఇప్పటివరకు ఎలాంటి గొడవలు  లేవని ఆయన గుర్తు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సంతోష్ చెప్పారు. తాను ఆత్మహత్య చేసుకున్న రవళిని ఇబ్బంది పెట్టినట్టుగా  చేస్తున్న ప్రచారంలో  వాస్తవం లేదన్నారు. తాను ఆస్తిలో  వాటా  అడగలేదని  ఆయన మీడియాకు  చెప్పారు. 

 

click me!