మెక్ డోనాల్డ్స్ లో బాలుడిని కరిచిన ఎలుక.. కేసు నమోదు..!

Published : Mar 11, 2023, 10:58 AM ISTUpdated : Mar 11, 2023, 01:45 PM IST
  మెక్ డోనాల్డ్స్ లో బాలుడిని కరిచిన ఎలుక.. కేసు నమోదు..!

సారాంశం

అనుకోకుండా ఒక ఎలుక వచ్చి... ఆ బాలుడిని కొరికింది. ఆ ఎలుక చాలా పొడవుగా ఉంది. బాలుడిపైకి ఎక్కి మరీ ఆ ఎలుక కొరకడం గమనార్హం.  ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమేరాలో కూడా రికార్డు అయ్యింది.

మెక్ డోనాల్డ్స్ లో లంచ్ చేయడానికి వెళ్లిన ఓ బాలుడిని ఎలుక కరిచింది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనపై కేసు నమోదైంది. 

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ... నగరానికి చెందిన ఓ వ్యక్తి తన ఎనిమిదేళ్ల కుమారుడితో కలిసి మెక్ డోనాల్డ్స్ కి వెళ్లాడు. అక్కడ వారు మీల్స్ తినడానికి వెళ్లారు. అయితే.. అనుకోకుండా ఒక ఎలుక వచ్చి... ఆ బాలుడిని కొరికింది. ఆ ఎలుక చాలా పొడవుగా ఉంది. బాలుడిపైకి ఎక్కి మరీ ఆ ఎలుక కొరకడం గమనార్హం.  ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమేరాలో కూడా రికార్డు అయ్యింది.

బాలుడి అరుపులు విని మెక్ డోనాల్డ్స్ సిబ్బంది, బాలుడి తండ్రి ముందుగా షాక్ అయ్యారు. వెంటనే రియాక్ట్ అయిన బాలుడి తండ్రి... ఆ ఎలుకను పక్కకు లాగి పడేశాడు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. బాలుడిని బోయినపల్లిలోని మిలిటరీ ఆస్పత్రిలో చేర్పించగా.. వెంటనే యాంటీ రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు.

కాగా... ఈ ఘటనపై బాలుడి తండ్రి సీరియస్ అయ్యారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు బాలుడి తండ్రి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదు చేయడం గమనార్హం. ఆయన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. మెక్ డోనాల్డ్స్  పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించడంలో విఫలమైందని ఆయన ఎఫ్ఐఆర్ లో పేర్కోనడం గమనార్హం.

కాగా... ఈ ఘటనపై మెక్ డోనాల్డ్స్ ఇండియా స్పందించింది. ‘మెక్‌డొనాల్డ్స్ ఇండియాలో మేము మా అన్ని రెస్టారెంట్‌లలో  నాణ్యత, సర్విస్,  శుభ్రత విషయంలో అత్యధిక స్థాయిలను ఎల్లప్పుడూ నిర్వహించడంలో గర్విస్తున్నాము. బాలుడిపై ఎలుక దాడి సంఘటన గురించి మాకు తెలిసింది.  ఈ సంఘటన రెస్టారెంట్‌లోని మా సిబ్బందికి  కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది.  కస్టమర్ల కోసం, సిబ్బంది వెంటనే పరిస్థితిని నిర్వహించడానికి చర్యలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వారి ఆడిట్‌లో  మేము రెస్టారెంట్‌లో అవసరమైన ప్రమాణాలను నిర్వహిస్తున్నామని కనుగొన్నారు.  మా రెస్టారెంట్‌లు అన్నీ ఎప్పటికప్పుడు పెస్ట్  కంట్రోల్ చేస్తూనే ఉంటాము. ఎలాంటి చీడపీడలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటాము.  మెక్‌డొనాల్డ్స్ ఇండియాలో, కస్టమర్ల భద్రత , శ్రేయస్సు మా అత్యంత ప్రాధాన్యత. మేము ఎల్లప్పుడూ సురక్షితమైన, పరిశుభ్రమైన , నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నాము." అంటూ మెక్ డోనాల్డ్స్ పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు