ఎమ్మెల్సీ కవితతో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు భేటీ..

Published : Mar 11, 2023, 10:54 AM ISTUpdated : Mar 11, 2023, 10:55 AM IST
ఎమ్మెల్సీ కవితతో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు భేటీ..

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కవిత ఈడీ విచారణకు బయలుదేరే ముందు ఆమెతో కేటీఆర్, హరీష్ రావులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకానున్న సంగతి తెలిసిందే. మరికాసేపట్లోనే ఆమె ఈడీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లనున్నారు. ఈడీ కార్యాలయానికి తనతో పాటు లాయర్‌ను తీసుకెళ్లాలని కవిత భావిస్తున్నారు. అయితే కవిత విచారణ సమయంలో లాయర్‌ను అనుమతిస్తారా? లేదా? అనేది స్పష్టత లేకుండా పోయింది. ప్రస్తుతం కవిత ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో బస చేస్తుండగా.. అక్కడికి భారీగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. 

ఈడీ విచారణకు సంబంధించి శుక్రవారం సాయంత్రం నుంచే లీగల్ టీమ్‌తో కవిత చర్చలు జరపుతున్నారు.  కవితకు మద్దతుగా కేటీఆర్, హరీష్ రావులతో పాటు పలువురు తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా ఢిల్లీకి చేరుకన్న సంగతి  తెలిసిందే. కవిత ఈడీ విచారణకు బయలుదేరే ముందు ఆమెతో కేటీఆర్, హరీష్ రావులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈడీ విచారణ సందర్భంగా అనుసరించాల్సిన వ్యుహాంపై వారు కవితతో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఆమెకు పలు సూచనలు కూడా చేస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు కవిత మానసికంగా సిద్దమైనట్టుగా తెలస్తోంది. 

కవితను ఈడీ అధికారులు విచారించనున్న నేపథ్యంలో ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద కూడా భారీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈడీ ఆఫీసు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈడీ ఆఫీసు వద్దకు చేరుకోకుండా భారీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ బారీకేడ్లను ఏర్పాటు చేశారు. 

అయితే ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలని కవితకు ఈడీ సమన్లు జారీచేసింది. మహిళ రిజర్వేషన్లపై ఢిల్లీలో దీక్ష, ఇతర ముందస్తు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో 9వ తేదీన  విచారణకు రాలేనని కవిత ఈడీకి తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈరోజు(మార్చి 11)న విచారణకు హాజరయ్యేందుకు సిద్దమయ్యారు. ఇక, ఈరోజు విచారణ సందర్భంగా అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. కవితను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు