జగిత్యాల చెరువులో వింత చేప... మత్స్యకారుడి వలకు చిక్కి.. (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 6, 2021, 5:20 PM IST
Highlights

జగిత్యాల జిల్లాకు చెందిన ఓ మత్స్యకారుడి వలకు అరుదైన చేప చిక్కింది. సముద్రపు చేప తెెలంగాణ చెరువలో చిక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

జగిత్యాల: సముద్రపై చేప చెరువులో ప్రత్యక్ష్యమయ్యింది... అదికూడా ఎలాంటి సముద్ర తీరం లేని తెలంగాణలో. జగిత్యాల జిల్లాలో ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన చేపను చూసి స్థానికులే కాదు మత్స్యశాఖ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు.  

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన గొల్లపెళ్లి రాజనర్సు మత్స్యకారుడు. రోజూ మాదిరిగానే గ్రామ శివారులోని చెరువులో చేపలవేటకు వెళ్లిన అతడికి అరుదైన చేప దొరికింది. తన వలలోపడ్డ ఆ చేపను చూసి ఆశ్చర్యపోయిన అతడూ దాన్ని మిగతా మత్స్యకారులకు కూడా చూపించాడు. జీవితమంతా చేపలవేటలోనే గడిచిపోయిన వారు కూడా ఆ చేప ఏంటో గుర్తించలేపోయారు. 

వీడయో

చివరకు ఈ అరుదైన చేపకు సంబంధించిన వివరాలను జిల్లా మత్య్సశాఖ అధికారులు తెలిపారకు. దీనిని డెవిల్(దెయ్యపు) చేప అంటారని... ఇవి ఎక్కువుగా సముద్రంలో ఉంటాయి అని తెలిపారు. మన తెలంగాణలోని వాగులో దొరకడం చాలా అరుదు అని అన్నారు. ఎగువన కురిసిన వర్షాలకు కాలువల ద్వారా వచ్చిఉండొచ్చని తెలిపారు.

 

click me!