హైద్రాబాద్ ఓయూ వద్ద యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి: బాధితురాలు ఆసుపత్రికి తరలింపు

By narsimha lode  |  First Published Sep 25, 2022, 9:29 AM IST

హైద్రాబాద్ నగరంలోని ఉస్మానియా  యూనివర్శిటీ వద్ద ఆదివారం నాడు ఉదయం డిగ్రీ విద్యార్ధినిపై ప్రేమోన్మాది దాడికి దిగాడు. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది. నిందితుడు రంజింత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 



హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ వద్ద ఆదివారం నాడు డిగ్రీ విద్యార్ధినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించారు.  డిగ్రీ చదివే విద్యార్ధినిపై యువకుడు అదును చూసి దాడి చేశారు.  యువతిపై దాడి చేసిన యువకుడిని రంజిత్ గా గుర్తించారు. హైద్రాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. యువతిపై దాడి చేసిన తర్వాత నిందితుడు రంజిత్ పారిపోయాడు. రంజిత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు చోట్ల మహిళలపై దాడులు చోటు చేసుకొన్నాయి. ప్రేమించలేదనే దాడులు చేసిన ఘటనలపై కేసులు నమోదయ్యాయి. అంతేకాదు లైంగిక వేధింపులకు సంబంధించి కేసులు దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ పదుల సంఖ్యలో చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. 

Latest Videos

undefined

ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన నల్గొండలో తనను ప్రేమించలేదని  రోహిత్ అనే యువకుడు యువతిని కత్తితో గొంతు కోశాడు. మిర్యాలగూడ రోడ్డులోని పార్క్ వద్దకు మాట్లాడుదామని పిలిపించి  యువతిపై దాడికి దిగాడు. అక్కడే ఉన్న ఆమె స్నేహితులు యువతిని ఆసుపత్రిలో చేర్పించారు. యువతి గొంతు కోసిన రోహిత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు తన ప్రేమను నిరాకరించిందనే నెపంతో బీహర్ రాష్ట్రంలోని   ఇంద్రపురి ప్రాంతంలో 9వ తరగతి విద్యార్ధినిపై తుపాకీతో కాల్పులకు దిగాడు. బాధితురాలు ఆసుపత్రిలో  చికిత్స పొందుతుంది. ఈ ఘటన ఈ  ఏడాది ఆగస్టు 18వ తేదీన జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని  కన్నిబొరయ్యహట్టిలో పెళ్లికి ఒప్పుకోలేదని యువతిని కత్తితో నరికి చంపాడు. యువతి తలను కోసి తనతో పాటు తీసుకెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన ఈ ఏడాది జూలై 22న జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో చెల్లి వరసయ్యే యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు యువకుడు. ఆమె మాత్రం అతడి ప్రేమను నిరాకరించింది.  స్కూటీపై వెళ్తున్న యువతిని యువకుడు కరుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆ యువతికి గాయాలయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.పుట్టినరోజు వేడుకలకు పిలిచి నిజామాబాద్ లో యువతిని బీరుసీసాతో ప్రేమోన్మాది గొంతు కోశాడు. ఈ ఘటన ఈ ఏడాది జూలై 17న జరిగింది. గుంటూరు జిల్లా కృష్ణానగర్ లో ప్రేమించలేదని యువతిపై దాడికి దిగాడు యువకుడు. ఈ సమయంలో అడ్డొచ్చిన యువతి తల్లిపై కూడా నిందితుడు దాడి చేశాడు. ఈ ఘటన ఈ ఏడాది జూన్ 1వ తేదీన జరిగింది. 


 

click me!